Telugu Global
Cinema & Entertainment

మూడు సినిమాలతో బిజీగా ఉన్న రామ్ చరణ్

స్టార్ హీరో ఎవరైనా సరే ఒక్క ఏడాది లో ఒక్క సినిమాతో మాత్రమే బిజీగా ఉంటారు, కానీ రామ్ చరణ్ మాత్రం ఒకే ఏడాది మూడు సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో వస్తున్న “వినయ విధేయ రామ” సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తో పాటు రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఆ తరువాత […]

మూడు సినిమాలతో బిజీగా ఉన్న రామ్ చరణ్
X

స్టార్ హీరో ఎవరైనా సరే ఒక్క ఏడాది లో ఒక్క సినిమాతో మాత్రమే బిజీగా ఉంటారు, కానీ రామ్ చరణ్ మాత్రం ఒకే ఏడాది మూడు సినిమాలతో బిజీగా గడుపుతున్నాడు. ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో వస్తున్న “వినయ విధేయ రామ” సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా తో పాటు రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న సినిమా లో నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ కూడా మరో హీరోగా నటిస్తున్నాడు.

ఇక ఆ తరువాత మెగా స్టార్ చిరంజీవి హీరోగా తను నిర్మిస్తున్న “సై రా” సినిమా నిర్మాణ పనులతో కూడా రామ్ చరణ్ బిజీగా ఉన్నాడు. దీని తరువాత కొరటాల శివ తో కలిసి స్క్రిప్ట్ వర్క్ లో బిజీ గా ఉన్నాడు. మొత్తానికి ఒక్క రోజు కూడా ఖాళి లేకుండా మూడు సినిమాల సెట్స్ కి వెళ్తూ మరో వైపు ఇంకో సినిమా కథా చర్చలో పాల్గొంటూ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు రామ్ చరణ్. ఇదిలా ఉంటే “వినయ విదేయ రామ” సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

First Published:  1 Dec 2018 10:32 PM GMT
Next Story