Telugu Global
Cinema & Entertainment

118 అంటున్న కల్యాణ్ రామ్

రెగ్యులర్ మాస్ మసాలా మూవీస్ కంటే కొత్తగా ఏదైనా ట్రై చేయాలని చూస్తుంటాడు కల్యాణ్ రామ్. మధ్యమధ్యలో మాస్ సినిమాలు చేసినా, కొత్తదనానికే ఈ హీరో తొలి ప్రాధాన్యం. ఈసారి కూడా ఈ హీరో అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. యాక్షన్ తో కూడిన పూర్తిస్థాయి సస్పెన్స్ థ్రిల్లర్ సెలక్ట్ చేసుకున్నాడు. ఆ సినిమాకు డిఫరెంట్ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అదే 118. అవును.. కేవీ గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ నటిస్తున్న సినిమాకు 118 అనే […]

118 అంటున్న కల్యాణ్ రామ్
X

రెగ్యులర్ మాస్ మసాలా మూవీస్ కంటే కొత్తగా ఏదైనా ట్రై చేయాలని చూస్తుంటాడు కల్యాణ్ రామ్. మధ్యమధ్యలో మాస్ సినిమాలు చేసినా, కొత్తదనానికే ఈ హీరో తొలి ప్రాధాన్యం. ఈసారి కూడా ఈ హీరో అలాంటి ప్రయత్నమే చేస్తున్నాడు. యాక్షన్ తో కూడిన పూర్తిస్థాయి సస్పెన్స్ థ్రిల్లర్ సెలక్ట్ చేసుకున్నాడు. ఆ సినిమాకు డిఫరెంట్ టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అదే 118.

అవును.. కేవీ గుహన్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్ నటిస్తున్న సినిమాకు 118 అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ అంకెకు, సినిమా కథకు చాలా లింక్ ఉందంటున్నారు మేకర్స్. నిజానికి ఈ అంకె చుట్టూనే సినిమా తిరుగుతుందని చెబుతున్నారు. సినిమాటోగ్రాఫర్ కేవీ గుహన్ కు దర్శకుడిగా ఇదే తొలి సినిమా.

మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ సినిమాలో నివేత థామస్, షాలినీ పాండే హీరోయిన్లుగా నటిస్తున్నారు. జనవరి మూడో వారంలో ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.

First Published:  3 Dec 2018 7:59 AM GMT
Next Story