Telugu Global
Cinema & Entertainment

2.0 మూవీ వీకెండ్ వసూళ్లు

చిట్టి రోబో వెండితెరపై సునామీ సృష్టిస్తున్నాడు. శంకర్ సృష్టించిన ఈ గ్రాఫిక్ వండర్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన ఈ 4 రోజుల్లో (మొదటి వారాంతం) 2.0 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయలు వచ్చినట్టు మేకర్స్ ప్రకటించిన అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. అంటే.. బ్రేక్ ఈవెన్ కు ఈ సినిమా మరో 150 కోట్ల రూపాయల దూరంలో మాత్రమే ఉంది. ఈ లెక్కన చూసుకుంటే మరో వారం రోజుల్లో ఈ సినిమా బ్రేక్-ఈవెన్ అవ్వడం ఖాయం. […]

2.0 మూవీ వీకెండ్ వసూళ్లు
X

చిట్టి రోబో వెండితెరపై సునామీ సృష్టిస్తున్నాడు. శంకర్ సృష్టించిన ఈ గ్రాఫిక్ వండర్ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన ఈ 4 రోజుల్లో (మొదటి వారాంతం) 2.0 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా 400 కోట్ల రూపాయలు వచ్చినట్టు మేకర్స్ ప్రకటించిన అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తారు.

అంటే.. బ్రేక్ ఈవెన్ కు ఈ సినిమా మరో 150 కోట్ల రూపాయల దూరంలో మాత్రమే ఉంది. ఈ లెక్కన చూసుకుంటే మరో వారం రోజుల్లో ఈ సినిమా బ్రేక్-ఈవెన్ అవ్వడం ఖాయం.

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, విడుదలైన ఈ 4 రోజుల్లో 2.0 సినిమాకు 33 కోట్ల రూపాయల షేర్ వచ్చినట్టు మేకర్స్ ప్రకటించారు. మరీ ముఖ్యంగా నైజాం నుంచి ఈ సినిమాకు కళ్లుచెదిరే వసూళ్లు వస్తున్నాయి. ఏపీ, నైజాంలో 2.0 సాధించిన 4 రోజుల (ఫస్ట్ వీకెండ్) షేర్స్ ఇలా ఉన్నాయి

నైజాం: రూ. 13.75 కోట్లు
సీడెడ్ : రూ. 5.3 కోట్లు
ఉత్తరాంధ్ర : రూ. 4.27 కోట్లు
ఈస్ట్ : రూ. 2.4 కోట్లు
వెస్ట్ : రూ. 1.71 కోట్లు
గుంటూరు : రూ. 2.64 కోట్లు
కృష్ణా: రూ. 1.99 కోట్లు
నెల్లూరు: రూ. 1.36 కోట్లు

First Published:  3 Dec 2018 8:04 AM GMT
Next Story