Telugu Global
NEWS

కూటమిని డిఫెన్స్ లో పడేసేలా.... హరీష్ ప్రెస్ మీట్

హరీష్ రావు ప్రజాకూటమి అభ్యర్థులకు పలు ఆధారాలు చూపిస్తూ ఇరుకున పెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పీసీసీ చీఫ్ ఉత్తమ్, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల, కాంగ్రెస్ శాసన సభాపక్ష ఉప నేత జీవన్ రెడ్డి సహా కాంగ్రెస్ తరుఫున నిలబడి…. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారి అందరి జాతకాలను తాజాగా హరీష్ రావు బయటపెట్టారు. సోమవారం మధ్యాహ్నం హరీష్ రావు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ […]

కూటమిని డిఫెన్స్ లో పడేసేలా.... హరీష్ ప్రెస్ మీట్
X

హరీష్ రావు ప్రజాకూటమి అభ్యర్థులకు పలు ఆధారాలు చూపిస్తూ ఇరుకున పెట్టారు. టీడీపీ అధినేత చంద్రబాబు, పీసీసీ చీఫ్ ఉత్తమ్, మాజీ పీసీసీ చీఫ్ పొన్నాల, కాంగ్రెస్ శాసన సభాపక్ష ఉప నేత జీవన్ రెడ్డి సహా కాంగ్రెస్ తరుఫున నిలబడి…. తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరించిన వారి అందరి జాతకాలను తాజాగా హరీష్ రావు బయటపెట్టారు. సోమవారం మధ్యాహ్నం హరీష్ రావు తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉద్యమ సమయంలో, తెలంగాణ వచ్చాక ఎన్నికల్లో కూటమిలోని కాంగ్రెస్, టీడీపీ నేతలు మాట్లాడిన మాటలకు సంబంధించిన పేపర్ కటింగ్ లను మీడియా ముందు ఉంచారు. కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే ఆంధ్రాలో కలిపేస్తామన్న మహబూబాబాద్ కాంగ్రెస్ మాజీ ఎంపీ బాలు నాయక్ వ్యాఖ్యలను ఉదహరించారు. ఇక పొన్నాల చేసిన కుట్రలను బయటపెట్టారు. గతంలో కేసీఆర్ పై పోటీచేసిన జీవన్ రెడ్డి వ్యవహారాన్ని బయట పెట్టారు.

ఇక కోదండరాం కూటమిలో చేరి అభాసుపాలయ్యారని…. తన ఉనికిని కాపాడుకోలేక, కక్కలేక మింగలేక…. కూటమి నుంచి బయటకు రాలేక అవమానాల పాలువుతున్నాడని హరీష్ రావు అన్నారు.

చంద్రబాబు హైదరాబాద్ లోని ఆంధ్రా సెటిలర్లు ఉన్న దగ్గర మాత్రమే ప్రచారం చేస్తున్నారని…. దమ్ముంటే కరీంనగర్, వరంగల్ కు వచ్చి ప్రచారం చేయాలని సవాల్ విసిరారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ గతంలో ఆంధ్రా పెత్తందార్లకు మద్దతుగా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు.

ఇలా కాంగ్రెస్ అభ్యర్థుల పేపర్ కటింగ్ లను పట్టుకొని హరీష్ రావు ఎండగట్టిన తీరు కూటమి అభ్యర్థులు, కాంగ్రెస్ నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డ చందంగా మారింది. తెలంగాణ కోసం కృషి చేస్తున్న పార్టీ తమదేనని హరీష్ రావు ఇలా ఆధారాలతో సహా నిరూపించి ప్రతిపక్షాన్ని డిఫెన్స్ లో పడేశారు. మరి దీనికి కాంగ్రెస్ నేతలు ఎలా కౌంటర్ ఇస్తారన్నది వేచిచూడాల్సిందే.

First Published:  3 Dec 2018 3:45 AM GMT
Next Story