Telugu Global
NEWS

కేసీఆర్ నమ్మకమే గెలిచింది.... అభ్యర్థులు కాదు.... పార్టీలే ముఖ్యమట....

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన మరుక్షణం కేసీఆర్ 105 మంది అభ్యర్థులను ప్రకటించేసి ధీమాగా ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగారు. ఠీవిగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కానీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాలుగు పార్టీలు మహాకూటమిగా ఏర్పడడం…. రాహుల్, చంద్రబాబు, సోనియా, తదితర అతిరథ మహామహులంతా కలిసి లాబీయింగ్ చేయడం, టీడీపీ రంగంలోకి దిగడంలో మీడియా మహా కూటమికి అండగా నిలవడంతో పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల పోలింగ్ కు మరో 4 రోజులు మాత్రమే […]

కేసీఆర్ నమ్మకమే గెలిచింది.... అభ్యర్థులు కాదు.... పార్టీలే ముఖ్యమట....
X

తెలంగాణ అసెంబ్లీని రద్దు చేసిన మరుక్షణం కేసీఆర్ 105 మంది అభ్యర్థులను ప్రకటించేసి ధీమాగా ఎన్నికల కార్యక్షేత్రంలోకి దిగారు. ఠీవిగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. కానీ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నాలుగు పార్టీలు మహాకూటమిగా ఏర్పడడం…. రాహుల్, చంద్రబాబు, సోనియా, తదితర అతిరథ మహామహులంతా కలిసి లాబీయింగ్ చేయడం, టీడీపీ రంగంలోకి దిగడంలో మీడియా మహా కూటమికి అండగా నిలవడంతో పరిస్థితిలో కాస్త మార్పు వచ్చింది.

ఇప్పుడు తెలంగాణ ఎన్నికల పోలింగ్ కు మరో 4 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ సందర్భంగా తెలుగులో ఓ అగ్రశ్రేణి పత్రిక తాజాగా ఓటరు నాడిని పసిగట్టేందుకు సర్వే నిర్వహించింది. ముఖ్యంగా హైదరాబాద్ లోని చార్మినార్, మెహదీపట్నం, ఉప్పల్, దిల్ సుఖ్ నగర్, ఎల్ బీనగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్, శేర్ లింగంపల్లి, కూకట్ పల్లి లలో సర్వే నిర్వహించారు.

తెలంగాణలోని హైదరాబాద్ ఓటర్లు ఏ పార్టీకి పట్టం కడుతారని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 23 నియోజకవర్గాలు ఎంతో కీలకం. ఇవి అధికారంలోకి వచ్చేవారిని డిసైడ్ చేయగలవు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ ఓటర్ల అభిప్రాయాలు తెలుసుకుంటే…. ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి..

ఈ ఎన్నికల్లో తాము నోటాకు ఓటు వేసి ఓటు ను వృథా చేసుకోమని దాదాపు 60శాతం మంది ఓటర్లు అభిప్రాయపడ్డారు. ఇక ఈసారి ఎవరికి ఓటేస్తారని ప్రశ్నిస్తే అందరూ చెప్పిన సమాధానం ఆసక్తి రేపింది. తాము అభ్యర్థిని చూసి ఓటేయమని…. తెలంగాణను పరిపాలించే పార్టీలే తమకు ముఖ్యమని కుండబద్దలు కొట్టారు. పథకాలు, పాలన ప్రభుత్వం చేతిలో ఉంటుందని.. అందుకే రాష్ట్రంలోని పార్టీలనే చూసి ఓటేస్తామని స్పష్టం చేశారు..

దీన్ని బట్టి కేసీఆర్ నమ్మకమే గెలిచిందని అర్థమవుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థులపై తీవ్ర వ్యతిరేకత ఉందని ప్రచారం జరుగుతోంది. కానీ జనం నాడి మాత్రం పార్టీల చుట్టే తిరుగుతోంది. అయితే కాంగ్రెస్ లేదంటే టీఆర్ఎస్ ఇలా పార్టీలను బట్టి ఓటేస్తామని ఓటర్లు చెప్పడం ఆసక్తికర పరిణామమే.. దీన్ని బట్టి అభ్యర్థులపై వ్యతిరేకత ఈ ఎన్నికల్లో పనిచేయదని తేటతెల్లమైంది.

First Published:  3 Dec 2018 3:55 AM GMT
Next Story