మీ చానల్‌ అమ్ముడుపోయింది… సీపీఎస్‌ సర్వేపై ఉత్తమ్‌ ఫైర్

అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ 94 నుంచి 104 సీట్లలో విజయం సాధిస్తుందంటూ సీపీఎస్ సంస్థ ఇచ్చిన సర్వే రిపోర్టుపై పీసీసీ చీఫ్ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సర్వేను ప్రసారం చేసిన ఒక ప్రముఖ టీవీ చానల్‌పై ఫైర్ అయ్యారు. చెత్త సర్వేను ప్రసారం చేశారంటూ మండిపడ్డారు.

టీ న్యూస్ కంటే దారుణంగా తయారయ్యారంటూ సదరు చానల్‌పై ఉత్తమ్‌ విమర్శించారు. చానల్‌ కేసీఆర్‌కు ఏజెంటుగా పనిచేస్తోందన్నారు. చానల్‌ టీఆర్‌ఎస్‌కు అమ్ముడుపోయిందని విమర్శించారు.

టీఆర్ఎస్‌కు వంద సీట్లు రాకపోతే మీ చానల్‌ మూసేస్తారా? అని ఉత్తమ్ సవాల్ చేశారు. మహాకూటమి 85 స్థానాల్లో విజయం సాధించబోతోందన్నారు. చానన్‌పై కేసీఆర్, కేటీఆర్‌ ఒత్తిడి తెచ్చి సీపీఎస్ సర్వేను ప్రసారం చేయించారన్నారు. ఎలాంటి దురుద్దేశం లేకుంటే సరిగ్గా నాలుగు రోజుల ముందు ఈ సర్వేను ప్రసారం చేయడం ఏమిటని ఉత్తమ్ ప్రశ్నించారు.