Telugu Global
Cinema & Entertainment

విక్రం కే కుమార్ సినిమాకి అనిరుద్ ని సెట్ చేసిన నాని

ప్రస్తుతం “జెర్సీ” షూటింగ్ లో బిజీగా ఉన్న నాని తన 24 వ సినిమాని అనౌన్స్ చేసాడు. “ఇష్క్” “మనం” “24” వంటి సినిమాలని డైరెక్ట్ చేసిన విక్రం కే కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి పి.సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ని కూడా నానినే రిఫర్ చేసాడట. ప్రస్తుతం తన “జెర్సీ” సినిమాకి సంగీతం అందిస్తున్న […]

విక్రం కే కుమార్ సినిమాకి అనిరుద్ ని సెట్ చేసిన నాని
X

ప్రస్తుతం “జెర్సీ” షూటింగ్ లో బిజీగా ఉన్న నాని తన 24 వ సినిమాని అనౌన్స్ చేసాడు. “ఇష్క్” “మనం” “24” వంటి సినిమాలని డైరెక్ట్ చేసిన విక్రం కే కుమార్ ఈ సినిమాని డైరెక్ట్ చేయనున్నాడు.

మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి పి.సి శ్రీరామ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ని కూడా నానినే రిఫర్ చేసాడట. ప్రస్తుతం తన “జెర్సీ” సినిమాకి సంగీతం అందిస్తున్న అనిరుద్ రవిచంద్రన్ ని తన 24 వ సినిమాకి కూడా మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోమని విక్రం కే కుమార్ కి చెప్పాడట నాని.

విక్రం కే కుమార్ కూడా అందుకు ఓకే చెప్పిన్నట్టు తెలుస్తుంది. ఒకవేళ “అజ్ఞాతవాసి” సినిమా హిట్ అయితే అనిరుద్ కి వరుస అవకాశాలు లభించేవి. కానీ అలా జరగలేదు. కానీ నాని మాత్రం అనిరుద్ కు బ్యాక్ టూ బ్యాక్ అవకాశాలు ఇచ్చాడు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి మొదలవుతుంది.

First Published:  2 Dec 2018 11:56 PM GMT
Next Story