Telugu Global
Cinema & Entertainment

ఆ డైరెక్టర్ కి కళ్యాణ్ రామ్ హ్యాండ్ ఇచ్చాడట?

నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ఏడాది “MLA” “నా నువ్వే” సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే…. కేవి గుహన్ దర్శకత్వంలో ఒక సినిమా…. “సావిత్రి” ఫేం పవన్ సాధినేని దర్శకత్వంలో ఒక సినిమాకి ఓకే చేసాడట. కానీ ఇందులో కెవి గుహన్ సినిమాకు మాత్రమే కళ్యాణ్ రామ్ డేట్స్ ఇచ్చాడు. “118” అనే టైటిల్ తో ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ కి రెడీ గా ఉంచాడు. అయితే ఇప్పటికీ […]

ఆ డైరెక్టర్ కి కళ్యాణ్ రామ్ హ్యాండ్ ఇచ్చాడట?
X

నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ఏడాది “MLA” “నా నువ్వే” సినిమాలతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఈ సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే…. కేవి గుహన్ దర్శకత్వంలో ఒక సినిమా…. “సావిత్రి” ఫేం పవన్ సాధినేని దర్శకత్వంలో ఒక సినిమాకి ఓకే చేసాడట.

కానీ ఇందులో కెవి గుహన్ సినిమాకు మాత్రమే కళ్యాణ్ రామ్ డేట్స్ ఇచ్చాడు. “118” అనే టైటిల్ తో ఇప్పుడు ఈ సినిమాని రిలీజ్ కి రెడీ గా ఉంచాడు. అయితే ఇప్పటికీ పవన్ సాధినేని సినిమానికి డేట్స్ ఇవ్వలేదట కళ్యాణ్ రామ్.

కళ్యాణ్ రామ్ డేట్స్ ఇస్తాడన్న నమ్మకంతో పవన్ సాధినేని గత ఏడాది కాలంగా ఈ సినిమా కథపై కసరత్తు చేస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా కథ పై పవన్ కి క్లారిటీ ఇవ్వలేదట కళ్యాణ్ రామ్.

ఇక ఇప్పుడు పవన్ కి…. కళ్యాణ్ రామ్ తో సినిమా ఉంటుందో లేదో అని అనుమానం వచ్చి వెంటనే శ్రీ విష్ణు కోసం ఒక కథ తయారు చేశాడట. కళ్యాణ్ రామ్ ఇక తనతో సినిమా చెయ్యడు అని గ్రహించిన పవన్ సాధినేని శ్రీ విష్ణుతో త్వరలో సినిమాని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడట. మొత్తానికి కళ్యాణ్ రామ్ హ్యాండిచ్చాడని భావించి ఎన్టీఆర్ ఆర్ట్స్ నుంచి వెళ్ళిపోయాడట పవన్ సాధినేని.

First Published:  4 Dec 2018 3:52 AM GMT
Next Story