రాజమౌళి హై బడ్జెట్ తో…. కార్తికేయ తక్కువ బడ్జెట్ తో….

ఎస్.ఎస్ రాజమౌళి కొడుగ్గా ఇండస్ట్రీ కి వచ్చాడు కార్తికేయ. తండ్రి లాగే కార్తికేయ కూడా దర్శకత్వం వైపు అడుగులు వేస్తారు అనుకున్నారు అంతా. కానీ కార్తికేయ మాత్రం డైరెక్టర్ కాకుండా ప్రొడ్యూసర్ అవ్వడానికి ఇష్టపడుతున్నాడు.

ఇప్పటికే కార్తికేయ తను ప్రొడ్యూస్ చేస్తున్న తోలి సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసాడు. “ఆకాశవాణి” అని టైటిల్ పెట్టుకున్న ఈ సినిమాని రాజమౌళి దగ్గర అసిస్టెంట్ గా పని చేస్తున్న అశ్విన్ గంగరాజు డైరెక్ట్ చేస్తున్నాడు. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం బడ్జెట్ ను ప్రమోషన్ ఖర్చులతో కలిపి అయిదు కోట్లకు మించకుండా కార్తికేయ ప్లాన్ చేస్తున్నాడట.  ప్రొడక్షన్ కోసం నాలుగు కోట్ల రూపాయలను దర్శకుడు ఇప్పటికే బడ్జెట్ ప్లాన్ వేశాడట.

మొత్తానికి సినిమాని చాలా తక్కువ బడ్జెట్ లో పూర్తి చేసి రిలీజ్ చేయాలనేది కార్తికేయ ప్లాన్. సో అప్పుడు సినిమాకి జస్ట్ ఆవరేజ్ టాక్ వచ్చినా కూడా సినిమాకి రెండు రెట్లు ప్రాఫిట్స్ వచ్చేలా కార్తికేయ ప్లాన్ చేసాడు. తొలి సినిమా కంప్లీట్ గా ప్రొడ్యూస్ చెయ్యకముందే ప్రొడ్యూసర్ లక్షణాలు అని అలవరుచుకున్నాడు కార్తికేయ.

అయితే రాజమౌళి మాత్రం హై బడ్జెట్ లో సినిమాలను ప్లాన్ చేస్తుంటే…. కొడుకు కార్తికేయ మాత్రం తక్కువ బడ్జెట్ లో ప్లాన్ చేయడం విశేషం.