పొలిటికల్ కథతో…. రజినీకాంత్, మురగదాస్….

సూపర్ స్టార్ రజనీకాంత్ తన వయసుని పట్టించుకోకుండా వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు. ఈ ఒక్క ఏడాదిలోనే “కాలా” “రోబో 2.o” సినిమాలు రిలీజ్ చేసి రికార్డ్స్ ని క్రియేట్ చేసాడు.

ఇక ఇప్పుడు రజినీకాంత్ ప్రస్తుతం “పెట్టా” సినిమాతో బిజీగా ఉన్నాడు. రెగ్యులర్ షూటింగ్ మొత్తం పూర్తీ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. పొంగల్ కానుకగా ఈ సినిమా తెలుగు, తమిళ బాషల్లో రిలీజ్ కానుంది.

అయితే ఇప్పుడు రజినీకాంత్ తన నెక్స్ట్ మూవీ కి సిద్దమవుతున్నాడు. మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా లో నటించేందుకు రజిని ఓకే చేసాడట. ఈ సినిమా పొలిటికల్ కథ తో రూపొందబోతుందట. ఇటీవలే మురగదాస్ డైరెక్ట్ చేసిన “సర్కార్” సినిమా చూసి రజనీకాంత్ ఈ అవకాశం ఇచ్చినట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాని ఎవరు ప్రొడ్యూస్ చేయబోతున్నారు అనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం మురగదాస్ ఈ సినిమా కథని డెవలప్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ నుంచి ఈ సినిమా షూటింగ్ కి వెళ్లనుంది.