Telugu Global
Cinema & Entertainment

వర్మ కథని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి

గత ఏడాది “ఫిదా” తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సాయి పల్లవికి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే సాయి పల్లవి ఇప్పుడు తను చేసే సినిమాల్లో మంచి కథ ఉండేలా చూసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో సాయి పల్లవి చాలా సినిమాలు రిజెక్ట్ చేస్తూ వస్తోంది. ఇక ఇప్పుడు సాయి పల్లవి మరో సినిమాను కూడా రిజెక్ట్ చేసిందని చెబుతున్నారు. సాయి పల్లవి ఎప్పుడూ సినిమాలో  తన క్యారెక్టర్ హైలైట్ అయ్యే కథలకు ఎక్కువగా […]

వర్మ కథని రిజెక్ట్ చేసిన సాయి పల్లవి
X

గత ఏడాది “ఫిదా” తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సాయి పల్లవికి తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది. అందుకే సాయి పల్లవి ఇప్పుడు తను చేసే సినిమాల్లో మంచి కథ ఉండేలా చూసుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలో సాయి పల్లవి చాలా సినిమాలు రిజెక్ట్ చేస్తూ వస్తోంది.

ఇక ఇప్పుడు సాయి పల్లవి మరో సినిమాను కూడా రిజెక్ట్ చేసిందని చెబుతున్నారు. సాయి పల్లవి ఎప్పుడూ సినిమాలో తన క్యారెక్టర్ హైలైట్ అయ్యే కథలకు ఎక్కువగా ఓకే చెబుతుంటుంది. తాజా సమాచారం ప్రకారం డైరెక్టర్ విరించి వర్మ దర్శకత్వం లో రూపొందబోయే సినిమాలో నటించేందుకు నిరాకరించింది అనే వార్తలు వినిపిస్తున్నాయి.

సాయి పల్లవి ని హీరోయిన్ ని అనుకోని ఒక కథ రెడీ చేసాడట విరించి వర్మ. కానీ విరించి వర్మ చెప్పిన కథ, అలాగే సినిమాలో తన క్యారెక్టర్ సాయి పల్లవికి నచ్చలేదట. అందుకే కూల్ గా సినిమాకి నో చెప్పిందట సాయి పల్లవి. ప్రస్తుతం సాయి పల్లవి శర్వానంద్ హీరోగా వస్తున్న “పడి పడి లేచే మనసు” సినిమా షూటింగ్ లో బిజీ గా ఉంది.

First Published:  3 Dec 2018 8:43 PM GMT
Next Story