నేను 30 కోట్ల హీరోని…. ఎనీ డౌట్స్

తనకు మార్కెట్ తగ్గిందనే మాటల్ని తిప్పికొడుతున్నాడు హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్. సాక్ష్యం సినిమా తర్వాత మార్కెట్ మందగించిందంటే ఒప్పుకోవడం లేదు. దానికి ఆయన కొన్ని సాక్ష్యాలు కూడా చెబుతున్నాడు. కవచం సినిమా ప్రమోషన్ లో భాగంగా తన మార్కెట్ వాల్యూపై బెల్లంకొండ స్పందించాడు.

“నిజమే, సాక్ష్యం సినిమా నిరాశపర్చింది. కానీ దాని వల్ల నా మార్కెట్ తగ్గలేదు. ఆ సినిమా 25 కోట్ల రూపాయల శాటిలైట్, డిజిటల్ మార్కెట్ చేసింది. థియేటర్ లో 15 కోట్ల రూపాయలొచ్చాయి. కవచం సినిమా కూడా శాటిలైట్, డిజిటల్ కలిపి 20 కోట్లు చేసింది. థియేటర్ లో 10 కోట్లు చేసినా చాలు, 30 కోట్లు వచ్చినట్టు లెక్క.”

ఇలా తన మార్కెట్ 30 కోట్ల రూపాయలకు ఫిక్స్ అయిందని చెబుతున్నాడు బెల్లంకొండ. తను ఓ నిర్మాత కొడుకునని, నిర్మాతల క్షేమం తన కనీస బాధ్యత అని స్పష్టంచేశాడు. ఇకపై కూడా తన సినిమాలు 30-35 కోట్ల రూపాయల రేంజ్ లోనే ఉంటాయంటున్నాడు ఈ హీరో.