కవచంలో నా క్యారెక్టర్ అదే

కవచం సినిమాలో మెహ్రీన్, కాజల్ ఇద్దరూ ఉన్నారు. మరి మెయిన్ హీరోయిన్ ఎవరు. ఈ విషయంపై కాజల్ రియాక్ట్ అయింది. తామిద్దరం మెయిన్ హీరోయిన్లమే అంటోంది. కథ అలా ఉంటుందని, ఫస్టాఫ్ లో మెహ్రీన్, సెకెండాఫ్ లో తన డామినేషన్ ఉంటుందని చెప్పుకొచ్చింది.

“సినిమాలో నా క్యారెక్టర్ మాత్రమే కనిపించదు. కానీ నా పాత్రకు కూడా ప్రాధాన్యం ఉంటుంది. సినిమా మొత్తం కొన్ని క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటుంది. సినిమా ఫస్టాఫ్ మొత్తం ఒక స్టోరీ రన్ అవుతుంటుంది. సెకండాఫ్ లో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంటుంది. ఆడియెన్స్ కి అది మైండ్ బ్లోయింగ్ ఎక్స్ పీరియన్స్ అవుతుంది.”

కవచం సినిమాలో థ్రిల్, సస్పెన్స్ తో పాటు అదిరిపోయే లవ్ స్టోరీ కూడా ఉంటుందని అంటోంది కాజల్. ఆ లవ్ స్టోరీ కూడా తనదే అని చెప్పుకొచ్చింది. థ్రిల్ ప్లస్ లవ్ కావాలంటే కవచం చూడాలంటోంది. ఇక హీరో శ్రీనివాస్ ను ఆకాశానికెత్తేసింది.

“శ్రీనివాస్ అందరికీ స్వీట్ హార్ట్. చాలా కష్టపడతాడు. ఒక రకంగా చెప్పాలంటే నేను కూడా శ్రీనివాస్ లాగే ఆలోచిస్తా. ఏదో ఒకటి చేయాలనుకుంటూనే ఉంటాడు. చాలా వైడ్ గా ఆలోచిస్తాడు. తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉండాలనుకుంటాడు”

ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా వస్తున్న కవచం సినిమా తన కెరీర్ కు మరింత ప్లస్ అవుతుందని భావిస్తోంది కాజల్.