Telugu Global
NEWS

డీజీపీ స్వయంగా హాజరు కావాలన్న హైకోర్టు

కొడంగల్ లో సీఎం కేసీఆర్ సభను జరగనివ్వనని పంతం పట్టి బంద్ కు పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. దీనిపై పెద్ద దుమారం రేగింది. కాంగ్రెస్ నేతలు హైకోర్టుకు కూడా వెళ్లారు. తాజాగా హైకోర్టు ఈ విషయంలో తెలంగాణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ పోలీసుల తీరు సరికాదని వ్యాఖ్యానించింది. తెలంగాణ పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకునేటప్పుడు సుప్రీం కోర్టు రూపొందించిన నిబంధనలు పాటించలేదని హైకోర్టు ఘాటుగా […]

డీజీపీ స్వయంగా హాజరు కావాలన్న హైకోర్టు
X

కొడంగల్ లో సీఎం కేసీఆర్ సభను జరగనివ్వనని పంతం పట్టి బంద్ కు పిలుపునిచ్చిన రేవంత్ రెడ్డిని పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.. దీనిపై పెద్ద దుమారం రేగింది. కాంగ్రెస్ నేతలు హైకోర్టుకు కూడా వెళ్లారు. తాజాగా హైకోర్టు ఈ విషయంలో తెలంగాణ పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలంగాణ పోలీసుల తీరు సరికాదని వ్యాఖ్యానించింది.

తెలంగాణ పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకునేటప్పుడు సుప్రీం కోర్టు రూపొందించిన నిబంధనలు పాటించలేదని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీసులు వ్యవహరించిన తీరుపై స్వయంగా తెలంగాణ డీజీపీ వచ్చి ఈ మధ్యాహ్నం 2.30కు హైకోర్టులో వివరణ ఇవ్వాలని తాజాగా న్యాయమూర్తులు ఆదేశాలిచ్చారు.

అయితే తెలంగాణ అడ్వకేట్ జనరల్ మాత్రం డీజీపీ హాజరు కాలేరని…. ఆయన ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారని మినహాయింపు ఇవ్వాలని హైకోర్టు కు తెలిపారు. కానీ కేసు తీవ్రత దృష్ట్యా డీజీపీ హాజరుకావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.

అధికార పక్షానికి పోలీసులు కొమ్ముకాస్తున్నారని కాంగ్రెస్ నేతల ఆరోపణలకు ఈరోజు హైకోర్టు తీర్పుతో కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రేవంత్ అరెస్ట్ విషయంలో ఏకంగా డీజీపీని హైకోర్టు బోనులో నిలబెట్టడం హాట్ టాపిక్ గా మారింది. మరి డీజీపీ ఏం వివరణ ఇస్తారు.. హైకోర్టు ఏం తీర్పునిస్తుందని ఆసక్తి రేపుతోంది.

First Published:  5 Dec 2018 1:05 AM GMT
Next Story