వెంకటేష్, వరుణ్ తేజ్ లతో చిందేయనున్న అనసూయ

స్టార్ యాంకర్ అయిన అనసూయ ఒక పక్క టీవి షోస్ చేస్తూనే మరో పక్క వరుసగా సినిమాల్లో నటిస్తుంది. ముఖ్యమైన పాత్రలతో పాటు ఐటెం సాంగ్స్  కూడా చేస్తుంది అనసూయ.

ఇప్పటికే సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ సరసన “విన్నర్” సినిమాలో ఒక ఐటెం సాంగ్ చేసింది. అలాగే అక్కినేని నాగార్జున సరనస “సోగ్గాడే చిన్ని నాయన” సినిమాలో కూడా ఐటెం సాంగ్ లో చేసింది అనసూయ.

ఇక ఇప్పుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న “ఎఫ్ 2” సినిమాలో కూడా ఐటెం సాంగ్ చేస్తుందట అనసూయ. ఈ సాంగ్ లో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మంచి మాస్ స్టెప్స్ తో ఆకట్టుకుంటదట అనసూయ. అన్నపూర్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా వేసిన ఒక విలేజ్ సెట్ లో ఈ ఐటెం సాంగ్ ని షూట్ చేయనున్నారట.

ఇదిలా ఉంటే పూర్తీ స్థాయి కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 12 న రిలీజ్ కానుంది. తమన్నా, మేహ్రిన్ లు ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటిస్తున్నారు.