Telugu Global
NEWS

నిన్న ఎన్డీటీవీ.... నేడు ఇండియా టుడే.... తెలంగాణలో టీఆర్‌ఎస్‌దే అధికారం

వరుసగా రెండో జాతీయ మీడియా సర్వే తెలంగాణలో కేసీఆర్ దే అధికార పీఠం అని స్పష్టం చేసింది. నిన్న ఎన్డీటీవీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తమ సర్వే నివేదికను బయటపెట్టగా .. తాజాగా ఇండియా టుడే కూడా తెలంగాణలో కేసీఆర్ దే అధికారం అని స్పష్టం చేసింది. ఇండియా టుడే పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(పీఎస్ఈ) నిర్వహించిన సర్వేలో తెలంగాణ లో ప్రస్తుతం 48శాతం మంది టీఆర్ఎస్ కు సపోర్టు చేస్తున్నారని.. అంటే జనాభాలో సగం […]

నిన్న ఎన్డీటీవీ.... నేడు ఇండియా టుడే.... తెలంగాణలో టీఆర్‌ఎస్‌దే అధికారం
X

వరుసగా రెండో జాతీయ మీడియా సర్వే తెలంగాణలో కేసీఆర్ దే అధికార పీఠం అని స్పష్టం చేసింది. నిన్న ఎన్డీటీవీ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని తమ సర్వే నివేదికను బయటపెట్టగా .. తాజాగా ఇండియా టుడే కూడా తెలంగాణలో కేసీఆర్ దే అధికారం అని స్పష్టం చేసింది.

ఇండియా టుడే పొలిటికల్ స్టాక్ ఎక్స్ఛేంజీ(పీఎస్ఈ) నిర్వహించిన సర్వేలో తెలంగాణ లో ప్రస్తుతం 48శాతం మంది టీఆర్ఎస్ కు సపోర్టు చేస్తున్నారని.. అంటే జనాభాలో సగం మంది టీఆర్ఎస్ అధికారంలోకి రావాలని కోరుతున్నారని తెలిపింది. పోయిన నెలలో 44శాతం మంది టీఆర్ఎస్ కు సపోర్టు చేయగా…. ఇప్పుడు 4శాతం మంది అదనంగా కేసీఆర్ అధికారంలోకి రావాలని కోరుతున్నట్టు సర్వేలో తెలిపారు.

తెలంగాణలో మెజార్టీ ప్రజలు ప్రస్తుత ప్రభుత్వం మారడానికి ఇష్టపడడం లేదని తమ సర్వేలో తేలినట్టు ఇండియా టుడే పీఎస్ఈ పేర్కొంది. నెల క్రితం 38శాతం మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండగా… ప్రస్తుతం వారి సంఖ్య 34శాతానికి తగ్గిందని తెలిపింది. ఆ 4 శాతం మంది టీఆర్ఎస్ పార్టీ వైపు మళ్ళినట్టు ఇండియా టుడే పేర్కొంది.

ఈ సర్వేలో 14శాతం మంది ప్రభుత్వాలపై నమ్మకం లేదనగా…. 22శాతం మంది ఏ ప్రభుత్వం వచ్చినా పర్లేదు అన్నారని ఇండియా టుడే తెలిపింది. మిగతా వాళ్ళు తమ అభిప్రాయాలను వెల్లడించలేదని తెలిపింది.

సర్వేలో దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ కూటమి బలం చాటుకుంటుందని.. ముఖ్యంగా టీడీపీ సాయంతో ఖమ్మం, రంగారెడ్డి జిల్లాలలో ఎక్కువ సీట్లు సాధిస్తుందని ఇండియా టుడే సర్వే తెలిపింది. కానీ 2019 లోక్ సభ ఎన్నికల్లో మాత్రం టీఆర్ఎస్ కు భారీగా సీట్లు వస్తాయని సర్వే తేల్చింది.

First Published:  5 Dec 2018 12:18 AM GMT
Next Story