Telugu Global
Cinema & Entertainment

అప్పుడు ఆయనకోసమే తగ్గాడు, ఇప్పుడు మళ్ళీ ఆయనకోసమే పెరుగుతున్నాడట

ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్స్ గా నటిస్తున్న సినిమా “ఆర్.ఆర్.ఆర్”. ఈ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ లుక్స్ ని పూర్తిగా మార్చేస్తున్నారట. ఎన్టీఆర్ అయితే ఎవరూ ఊహించని విధంగా బరువు పెరిగుతున్నాడట. ఎన్టీఆర్ ఇప్పటికే 100 కేజీల బరువుకు చేరుకున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ పోషించే పాత్రకోసం భారీకాయంతో కనిపించాల్సి ఉందట. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “యమదొంగ” సినిమా కోసం ఎన్టీఆర్ బాగా బరువు తగ్గాడు. మళ్ళీ […]

అప్పుడు ఆయనకోసమే తగ్గాడు, ఇప్పుడు మళ్ళీ ఆయనకోసమే పెరుగుతున్నాడట
X

ఎస్.ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీ స్టారర్స్ గా నటిస్తున్న సినిమా “ఆర్.ఆర్.ఆర్”. ఈ సినిమా కోసం ఎన్టీఆర్, రామ్ చరణ్ తమ లుక్స్ ని పూర్తిగా మార్చేస్తున్నారట. ఎన్టీఆర్ అయితే ఎవరూ ఊహించని విధంగా బరువు పెరిగుతున్నాడట. ఎన్టీఆర్ ఇప్పటికే 100 కేజీల బరువుకు చేరుకున్నట్లు సమాచారం.

ఎన్టీఆర్ పోషించే పాత్రకోసం భారీకాయంతో కనిపించాల్సి ఉందట. గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన “యమదొంగ” సినిమా కోసం ఎన్టీఆర్ బాగా బరువు తగ్గాడు. మళ్ళీ ఇప్పుడు “ఆర్.ఆర్.ఆర్” కోసం ఎన్టీఆర్ చాలా బరువు పెరుగుతున్నాడు.

తాజాగా జూనియర్ ఎన్టీఆర్ భారీ కాయంతో కనిపిస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మరి ఇలా ఒకేసారి ఎన్టీఆర్ బరువు పెరిగి తన ఆరోగ్యాన్ని రిస్క్ లో పెడుతున్నడా అనేది చాలా మందిలో అనుమానంగా ఉంది. కానీ రాజమౌళి అన్ని ప్రత్యేక శ్రద్దలు తీసుకునే ఎన్టీఆర్ ని బరువు పెరిగిస్తున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ లో బిజీగా ఉంది. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి డి.వి.వి దానయ్య ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

First Published:  5 Dec 2018 5:28 AM GMT
Next Story