Telugu Global
Cinema & Entertainment

వారం రోజుల్లో రూ. 500 కోట్లు

ఇండియాలోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన 2.0 సినిమా మొదటి వారం పూర్తిచేసుకొని, రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఈ 7 రోజుల్లో 2.0 సినిమాకు వరల్డ్ వైడ్ 500 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్టు లైకా ప్రొడక్షన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే తాజా వసూళ్లతో ఈ సినిమా బాహుబలి-2ను మాత్రం క్రాస్ చేయలేకపోయింది. బాహుబలి-2 సినిమాకు విడుదలైన 5 రోజులకే 500 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 2.0కు మాత్రం ఈ ఘనత సాధించడానికి వారం […]

వారం రోజుల్లో రూ. 500 కోట్లు
X

ఇండియాలోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిన 2.0 సినిమా మొదటి వారం పూర్తిచేసుకొని, రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఈ 7 రోజుల్లో 2.0 సినిమాకు వరల్డ్ వైడ్ 500 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చినట్టు లైకా ప్రొడక్షన్స్ ఓ ప్రకటనలో తెలిపింది. అయితే తాజా వసూళ్లతో ఈ సినిమా బాహుబలి-2ను మాత్రం క్రాస్ చేయలేకపోయింది.

బాహుబలి-2 సినిమాకు విడుదలైన 5 రోజులకే 500 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. 2.0కు మాత్రం ఈ ఘనత సాధించడానికి వారం రోజులు పట్టింది. అటు బాహుబలి-1 రికార్డుల్ని మాత్రం ఈ సినిమా అధిగమించింది. ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ సినిమా మరో 10 రోజుల పాటు థియేటర్లలో కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి.

ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వలేదు. 74 కోట్ల రూపాయలకు ఈ సినిమా తెలుగు థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోగా.. ఫస్ట్ వీక్ లో 40 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. ఏపీ, నైజాంలో ఈ 7 రోజుల్లో 2.0కు వచ్చిన వసూళ్లు (షేర్) ఇలా ఉన్నాయి

నైజాం – రూ. 17 కోట్లు
సీడెడ్ – రూ. 6.25 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 5.01 కోట్లు
ఈస్ట్ – రూ. 2.92 కోట్లు
వెస్ట్ – రూ. 2.04 కోట్లు
గుంటూరు – రూ. 2.90 కోట్లు
కృష్ణా – రూ. 2.34 కోట్లు
నెల్లూరు – రూ. 1.56 కోట్లు

First Published:  6 Dec 2018 7:02 AM GMT
Next Story