సంక్రాంతి సినిమాల తేదీలు ఫిక్స్?

సంక్రాంతి సినిమాలు శరవేగంగా రెడీ అవుతున్నాయి. ప్రస్తుతానికైతే 3 సినిమాలు రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేశాయి. వీటిలో ఒక సినిమా విడుదల తేదీని అఫీషియల్ గా ప్రకటిస్తే, మరో 2 డేట్స్ ను త్వరలోనే ప్రకటించబోతున్నారు. లిస్ట్ లో మరో 2 సినిమాలు కూడా చేరే ఛాన్స్ ఉంది.

ఎన్టీఆర్ బయోపిక్ లో ఫస్ట్ పార్ట్ గా వస్తోంది కథానాయకుడు సినిమా. బాలయ్య లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదల చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మరో 10 రోజుల్లో షూటింగ్ పూర్తిచేసుకోబోతోంది.

కథానాయకుడు సినిమా వచ్చిన 2 రోజులకు వినయ విధేయ రామగా థియేటర్లలోకి రాబోతున్నాడు రామ్ చరణ్. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జనవరి 11న విడుదల చేయబోతున్నారు. త్వరలోనే దీనిపై ఆఫీషియల్ స్టేట్ మెంట్ రాబోతోంది. కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది.

వినయ విధేయ రామ, కథానాయకుడు సినిమాలతో పాటు ఎఫ్-2 కూడా ముస్తాబైంది. ఒక పాట మినహా, షూటింగ్ మొత్తం పూర్తిచేసుకున్న ఈ సినిమాను జనవరి 12న థియేటర్లలోకి తీసుకురావాలని నిర్ణయించారు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో తమన్న, మెహ్రీన్ హీరోయిన్లు. అనీల్ రావిపూడి దర్శకుడు.

ప్రస్తుతానికైతే సంక్రాంతి బరిలో ఈ 3 సినిమాలే ఉన్నాయి. మరో 2 సినిమాలు జాబితాలో చేరే అవకాశం. సంక్రాంతికి ఎన్ని సినిమాలు వచ్చినా వసూళ్లు గ్యారెంటీ అనే నిజం ప్రతి ఏటా కనిపిస్తూనే ఉంది.