కేసీఆరే మళ్లీ సీఎం కావాలి…. నాలుక కోసుకున్న ఆంధ్రా యువకుడు!

టీఆరెఎస్ అధినేత కేసీఆర్ కు… తెలంగాణ రాష్ట్రంలోనే కాదు పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ లోనూ అభిమానులు ఉన్నారు. ఆంధ్రాలో సీఎం కేసీఆర్ కు సంబంధించి కటౌట్లు కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి.

అయితే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ ….ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాయి. తన నాలుకను తానే కోసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని శ్రీనగర్ కాలనీలో చోటుచేసుకుంది. ఆ వ్యక్తికి కేసీఆర్ అంటే ఎనలేని అభిమానం. ఆ అభిమానంతోనే కేసీఆరే సీఎం కావాలని ఈ అఘాత్యానికి పాల్పడ్డాడు.

బుధవారం సాయంత్రం శ్రీనగర్ కాలనీలోని వెంటేశ్వర స్వామి అలయానికి వెళ్లి….అక్కడ కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ ముడుపుగా నాలుకను కోసుకోని హుండీలో వేశాడు. ఈ సంఘటన కలకలం రేపింది. దీంతో అతనిని దగ్గరలోని ఆసుపత్రి తరలించి…చికిత్స అందిస్తున్నారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన మహేశ్ గా పోలీసులు గుర్తించారు.