5 వేల పరుగుల క్లబ్ లో టీమిండియా నయావాల్

  • టెస్ట్ క్రికెట్లో 12వ భారత క్రికెటర్ చతేశ్వర్ పూజారా
  • టెస్ట్ క్రికెట్లో 16వ శతకం సాధించిన నయా వాల్
  • 5వేల పరుగుల మైలురాయి చేరిన 12వ భారత క్రికెటర్

నయావాల్ చతేశ్వర్ పూజారా… అడిలైడ్ టెస్ట్ తొలిరోజు ఆటలో ఫైటింగ్ సెంచరీతో టీమిండియాను ఆదుకొన్నాడు.

కంగారూ పేస్ కు ఓ వైపు టపటపా వికెట్లు రాలుతున్నా పూజారా మాత్రం…క్రీజునే అంటిపెట్టుకొని ఆడి..బాధ్యతాయుతమైన సెంచరీ సాధించాడు.

 మొత్తం 231 బాల్స్ ఎదుర్కొని 6 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో…తన 16వ టెస్ట్ శతకాన్ని పూర్తి చేశాడు.

ఈ క్రమంలో 5 వేల పరుగుల రికార్డును సైతం కైవసం చేసుకొన్నాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో 5 వేల పరుగుల మైలు రాయి చేరిన భారత 12వ క్రికెటర్ గా నిలిచాడు. చివరకు 123 పరుగుల స్కోరుకు పూజారా రనౌట్ గా వెనుదిరిగాడు.