నవ్వించడానికి వస్తోన్న “ఎఫ్ 2” టీజర్…..

అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా వస్తున్న సినిమా “ఎఫ్ 2”. పూర్తీ స్థాయి కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమా టిజర్ డిసెంబర్ 12 న రిలీజ్ చేస్తున్నారు మూవీ యూనిట్. డిసెంబర్ 12 న వెంకటేష్ పుట్టిన రోజు కానుకగా ఈ టీజర్ ని వదులుతున్నారు. టీజర్ ని ఫుల్ కామెడీ గా కట్ చేసాడట అనిల్ రావిపూడి.

టీజర్ పక్కా తెలుగు ప్రేక్షకులని ఆకట్టుకుతుందని అనిల్ రావిపూడి ధీమా. ఇదిలా ఉంటే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం ఐటెం సాంగ్ షూటింగ్ లో బిజీగా ఉంది. ఈ ఐటెం సాంగ్ లో వెంకటేష్ తో వరుణ్ తేజ్ లతో అనసూయ డాన్స్ చేయనుంది.

ఇక ఈ పాట షూటింగ్ ని కూడా త్వరగా పూర్తి చేసుకొని డబ్బింగ్ పనుల్లోకి బిజీ కానుందట యూనిట్. ఇక అన్ని పనులు పూర్తయ్యాక త్వరలో సెన్సార్ కూడా పూర్తి చేసి వచ్చే ఏడాది జనవరి 12 న సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.