మరోసారి మెరిసిన గీతగోవిందం

విజయ్ దేవరకొండ కెరీర్ లోనే కాదు, ఈ ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది గీతగోవిందం సినిమా. కేవలం సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా స్మాల్ స్క్రీన్ పై కూడా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ లో భాగంగా ఫస్ట్ టైం జీ తెలుగులో ఈ సినిమాను ప్రసారం చేస్తే ఏకంగా 20.7 టీఆర్పీ వచ్చింది. ఇదే ఓ రికార్డు అనుకుంటే ఇప్పుడు బుల్లితెరపై మరో రికార్డు కూడా సృష్టించింది ఈ సినిమా.

జస్ట్ వారం రోజుల గ్యాప్ లో గీతగోవిందం సినిమాను మరోసారి జీ తెలుగులో ప్రసారం చేశారు. ఆశ్చర్యకరంగా ఈసారి కూడా ఈ సినిమాకు కళ్లుచెదిరే రేటింగ్ రావడం విశేషం. ఏకంగా 17.5 టీఆర్పీ వచ్చింది ఈ సినిమాకి. రెండోసారి ప్రసారం చేసినప్పుడు ఓ సినిమాకు ఇంత రేటింగ్ రావడం ఓ రికార్డు.

రంగస్థలం సినిమాను ఫస్ట్ టైం స్టార్ మాటీవీలో ప్రసారం చేసినప్పుడు 19.5 టీఆర్పీ వచ్చింది. ఇదే సినిమాను వారం గ్యాప్ లో రెండోసారి టెలీకాస్ట్ చేసినప్పుడు కేవలం 7 రేటింగ్ వచ్చింది. గీతగోవిందం సినిమాను అదే విధంగా టెలీకాస్ట్ చేస్తే ఏకంగా 17.5 రేటింగ్ రావడం విశేషం.