ముచ్చటగా మూడో సారి కుర్ర హీరో తో రొమాన్స్ చేస్తున్న కాజల్ అగర్వాల్

స్టార్ హీరోయిన్ కాజల్ ప్రస్తుతం “కవచం” సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీ గా ఉంది. ఈ సినిమా లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన కాజల్ హీరోయిన్ గా నటించింది. అలాగే కాజల్ తో పాటు మెహరిన్ కూడా ఒక హీరోయిన్ గా నటించింది. కానీ ఈ సినిమాలో కాజల్, శ్రీనివాస్ కెమిస్ట్రీ చాలా బాగుందన్న వార్తలు వినిపిస్తున్నాయి .

అయితే ఈ ప్రమోషన్స్ లో కాజల్ మాట్లాడుతూ “నేను బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో కలిసి మరొక సినిమా లో కూడా నటించబోతున్నాను” అని తెలిపింది. ఇప్పటికే కాజల్ అగర్వాల్ బెల్లంకొండ శ్రీనివాస్ తో తేజ దర్శకత్వం లో ఒక సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా కాకుండా ఇప్పుడు మరో సినిమాలో వీళ్లిద్దరూ కలిసి నటిస్తున్నారట.

ఈ మూవీ డీటెయిల్స్ ని త్వరలో చిత్ర యూనిట్ మీడియా కి తెలియచెయ్యబోతున్నారు. దీన్ని బట్టి చూస్తుంటే బెల్లంకొండ శ్రీనివాస్ తో కాజల్ కి ఇది మూడవ సినిమా అవుతుంది.