ముగ్గురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేస్తున్న మహేష్ బాబు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎప్పుడూ తన సినిమాల్లో ఎక్కువ మంది హీరోయిన్స్ ని పెట్టడానికి ఇష్టపడడు. కానీ మహేష్ బాబు 25 వ సినిమాగా తెరకెక్కుతున్న “మహర్షి” సినిమాలో మాత్రం ముగ్గురు హీరోయిన్స్ ని పెట్టాడు.

ఇప్పటికే ఈ సినిమాలో పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ గా సోనాల్ చౌహాన్ ని తీసుకున్నారు మూవీ యూనిట్. సోనాల్ చౌహాన్ ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్రలో నటిస్తుంది. ఇప్పుడు సోనాల్ చౌహాన్ తో పాటు మరో హీరోయిన్ ని కూడా తీసుకున్నారు టీం.

ఇది వరకు మహేష్ బాబు తో “దూకుడు” సినిమాలో టైటిల్ సాంగ్ లో మహేష్ బాబు తో కలిసి డాన్స్ చేసిన మీనాక్షి దీక్షిత్ ని కూడా ఒక హీరోయిన్ గా తీసుకున్నారట. అయితే ఈ సినిమాలో మీనాక్షి దీక్షిత్ అల్లరి నరేష్ సరసన నటిస్తుంది అని టాక్. పూర్తి స్థాయిగా రైతులు గురించి రూపొందుతున్న ఈ సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. దిల్ రాజు, అశ్విని దత్ ఈ సినిమాని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.