హిట్టు కోసం స్టార్ రైటర్ ని వేడుకుంటున్న నాగ చైతన్య

అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్నాడు. గత ఏడాది “యుద్ధం శరణం” సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న నాగ చైతన్య ఈ ఏడాది “శైలజా రెడ్డి అల్లుడు” సినిమాతో మొదటి ఫ్లాప్ ని అందుకున్నాడు. అయితే ఈ సినిమా కమర్షియల్ గా కొంత వరకు పర్వాలేదు అనిపించినా కూడా నిర్మాతలకి మాత్రం నష్టాల్ని తెచ్చిపెట్టింది. అయితే ఈ సినిమా తరువాత తనకి హిట్ ఇచ్చిన చందు మొండేటి దర్శకత్వంలో “సవ్యసాచి” అనే సినిమా చేసి రిలీజ్ చేసాడు నాగ చైతన్య. ఈ సినిమా కూడా ప్రేక్షకుల అంచనాల్ని అందుకోలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

అయితే ఇప్పుడు నాగ చైతన్య కి ఎలాగైనా సరే భారీ బ్లాక్ బస్టర్ కావలి. అందుకే నాగ చైతన్య స్టార్ రైటర్ అయిన విజయేంద్ర ప్రసాద్ గడప తొక్కాడట. విజయేంద్ర ప్రసాద్ ని కలిసి తన కోసం ఒక మంచి కమర్షియల్ కథ రాయాలి అని అడిగాడట. మరి విజయేంద్ర ప్రసాద్ నాగ చైతన్య కోసం ఎలాంటి కథ రెడీ చేస్తాడో చూడాలి. ఇదిలా ఉంటే ప్రస్తుతం నాగ చైతన్య “మజిలి” సినిమా లో నటిస్తున్నాడు. శివ నిర్వాణ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో సమంతా హీరోయిన్ గా నటిస్తుంది.