Telugu Global
Cinema & Entertainment

మరో ఘనత సాధించిన విజయ్ దేవరకొండ

యూత్ నే టార్గెట్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ, ఇప్పుడు మరో ఘనత సాధించాడు. ఏకంగా ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కాడు ఈ హీరో. ఇండియాలో టాప్-100 సెలబ్రిటీస్ లిస్ట్ లో విజయ్ దేవరకొండ పేరు కూడా చేరింది. కెరీర్ స్టార్ట్ చేసిన అతికొద్ది కాలానికే ఇలా ఫోర్బ్స్ లోకి ఎక్కడం ఓ రికార్డు. టాప్-100 ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్ లో విజయ్ దేవరకొండకు 72వ ర్యాంక్ ఇచ్చింది ఫోర్బ్స్. ఈ […]

మరో ఘనత సాధించిన విజయ్ దేవరకొండ
X

యూత్ నే టార్గెట్ చేస్తూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో దూసుకుపోతున్న విజయ్ దేవరకొండ, ఇప్పుడు మరో ఘనత సాధించాడు. ఏకంగా ఫోర్బ్స్ జాబితాలోకి ఎక్కాడు ఈ హీరో. ఇండియాలో టాప్-100 సెలబ్రిటీస్ లిస్ట్ లో విజయ్ దేవరకొండ పేరు కూడా చేరింది. కెరీర్ స్టార్ట్ చేసిన అతికొద్ది కాలానికే ఇలా ఫోర్బ్స్ లోకి ఎక్కడం ఓ రికార్డు.

టాప్-100 ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్ లో విజయ్ దేవరకొండకు 72వ ర్యాంక్ ఇచ్చింది ఫోర్బ్స్. ఈ ఏడాది అతడి ఆస్తిని 14 కోట్ల రూపాయలుగా పేర్కొంది. అర్జున్ రెడ్డితో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న దేవరకొండ, ఈ ఇయర్ గీతగోవిందం, టాక్సీవాలా సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఆ రెండు సినిమాలనే ఇతడ్ని ఫోర్బ్స్ లిస్ట్ లోకి చేర్చాయి.

ఆశ్చర్యకరంగా ఈ లిస్ట్ లో రామ్ చరణ్ కూడా అదే ర్యాంక్ తో కొనసాగుతున్నాడు. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ ఇద్దరికీ 72వ ర్యాంక్ షేర్ చేసింది ఫోర్బ్స్. వీళ్లిద్దరి ఆస్తిని చెరో 14 కోట్ల రూపాయలుగా చెప్పుకొచ్చింది. ఇక సౌత్ నుంచి ఈ లిస్ట్ లో రజనీకాంత్ టాప్ ప్లేస్ లో ఉండగా.. పవన్ కల్యాణ్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు.

First Published:  5 Dec 2018 9:23 PM GMT
Next Story