ఫన్నీ టైటిల్ తో వస్తున్న సందీప్ కిషన్

వరుస ప్లాప్ లతో యంగ్ హీరో సందీప్ కిషన్ కి ప్రస్తుతం తెలుగు లో ఎక్కువ అవకాశాలు లేవు. తమిళ్ లో మాత్రం సినిమాలు చేస్తూ వస్తున్న సందీప్ కిషన్ తెలుగు లో మాత్రం సినిమాలు చాలా వరకు తగ్గించాడు.

ఇక చాలా కాలం తరువాత సందీప్ కిషన్ నుంచి వస్తున్న తెలుగు సినిమా “నెక్స్ట్ ఏంటి”. తమన్నా హీరోయిన్ గా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ డిసెంబర్ 7 న రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా తరువాత సందీప్ కిషన్ కి మరో తెలుగు అవకాశం వచ్చింది. కామెడీ చిత్రాల దర్శకుడు అయిన జి.నాగేశ్వరెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు సందీప్ కిషన్. పూర్తి స్థాయి కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి “తెనాలి రామకృష్ణ బిఎబిఎల్” అనే ఫన్ని టైటిల్ ని పెట్టారు మూవీ యూనిట్.

హన్సిక ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం సందీప్ కిషన్ “నెక్స్ట్ ఏంటి” ప్రమోషన్స్ పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా నుంచి సందీప్ కిషన్ ఫ్రీ కాగానే “తెనాలి రామకృష్ణ బిఎబిఎల్” సినిమా యొక్క రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది.