ఆంధ్రా, సీమకు కుల జాడ్యం తప్పదు…. కానీ మీకెందుకు…. తరిమికొట్టండి – తెలంగాణ ప్రజలకు మోహన్ బాబు పిలుపు

నటుడు మోహన్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ట్విట్టర్ వేదికగా స్పందించారు. కుల జాడ్యానికి లోను కావొద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. కులజాడ్యం ఆంధ్రా, రాయలసీమకు ఎలాగో తప్పదని…. అవి మీకెందుకు…. తరిమికొట్టండి అని తెలంగాణ ప్రజలకు మోహన్ బాబు పిలుపునిచ్చారు.

కేసీఆర్‌ పైనా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు మోహన్ బాబు. 2014లో విలన్‌గా కనిపించిన కేసీఆర్‌కు…. ఇప్పుడు తాను అనుకూలంగా మాట్లాడుతానని ఊహించలేదన్నారు. కష్టపడి సాధించుకున్న రాష్ట్రాన్ని కాపాడుకోండి అని తెలంగాణ ప్రజలకు మోహన్ బాబు పిలుపునిచ్చారు.

మోహన్‌ బాబు ట్విట్టర్‌లో ఏమన్నారంటే… ”రాయలసీమ వాసిగా చెబుతున్నా…. 2014లో విలన్‌లా కనిపించిన కేసీఆర్‌కి 2018లో నేను అనుకూలంగా మాట్లాడతానని అనుకోలేదు. కారణం ఒక్కటే…. కష్టపడి ఒక రాష్ట్రాన్ని సాధించుకున్నారు కాపాడుకోండి. ఈ కుల జాడ్యం, ఆంధ్రా, సీమలకు తప్పవు… అవి మీకెందుకు… తరిమికొట్టండి’’ అంటూ మోహన్‌బాబు ట్విట్టర్‌లో తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.