టీడీపీ నోట్ల కుప్పను ప్రదర్శించిన టీఆర్‌ఎస్‌ నేత

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరికొన్ని గంటలు మాత్రమే ఉండడంతో నోట్ల కట్టలు బుసలు కొడుతున్నాయి. ప్రతిష్టాత్మక నియోజక వర్గాల్లో కోట్లాది రూపాయలను ప్రజలపైకి వెదజల్లుతున్నారు. హైదరాబాద్‌లోని కొన్ని నియోజక వర్గాల్లో ఓటుకు 10 వేలు ఇచ్చేందుకు కూడా వెనుకాడడం లేదు. అయితే ప్రత్యర్థి పార్టీలు కూడా మాటేసి ఉండడంతో డబ్బుల సంచులతో ఈజీగా దొరికిపోతున్నారు.

టీడీపీకి ప్రతిష్టాత్మకంగా మారిన కూకట్‌పల్లిలో ధన ప్రవాహం భారీగా సాగుతోంది. రాత్రి ఏపీ టీడీపీ నేత జూపూడి ప్రభాకర్ రావు ఇంటి వద్ద భారీగా నగదు పట్టుబడింది. ఒక డబ్బు సంచిని టీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమాచారంతో పోలీసులు స్వాధీనం చేసుకోగా… మరో రెండు డబ్బు సంచులతో టీడీపీ కార్యకర్తలు పారిపోయారు.

టీఆర్‌ఎస్ కార్యకర్తలు బైకులపై వెంటాడి ఇద్దరు వ్యక్తులను, ఒక డబ్బు సంచిని స్వాధీనం చేసుకున్నారు.
మరో ముగ్గురు వ్యక్తులు రెండు డబ్బు సంచులతో పారిపోయారు. పట్టుబడిన డబ్బును టీఆర్‌ఎస్ స్థానిక నేత గోనె శ్రీనివాసరావు మీడియా ముందు ప్రదర్శించారు. 500 రూపాయల నోట్ల కట్టలను ప్రజలకు చూపించారు.

ఈ డబ్బును టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసిని తరపున పంచేందుకు తెచ్చి జూపూడి ప్రభాకర్ ఇంట్లో దాచారని ఆయన వివరించారు. పోలీసులు వెళ్లగానే డబ్బు సంచులను ఇంటి వెనుక వైపుకు విసిరివేశారని చెప్పారు. ఆ డబ్బు సంచులను తీసుకుని పారిపోతున్న వ్యక్తుల్లో ఒకరిని పట్టుకున్నామని వివరించారు.

హైదరాబాద్‌ను నేనే కట్టా అని చెప్పుకునే చంద్రబాబు… నిజాయితీగా ఓట్లేయించుకోవడం మానేసి ఇలా నీచంగా డబ్బులు వెదజల్లడం ఏమిటని టీఆర్‌ఎస్ నేత ప్రశ్నించారు. డబ్బుతో తెలంగాణ ప్రజలను కొనేందుకు వస్తున్న టీడీపీకి బుద్ధి చెప్పాలని కోరారు.

తెలుగు దేశం పార్టీ వాళ్లు ఎంత నీచానికి దిగజారిపోయారో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. సుహాసిని తరపున డబ్బులు పంచానికి తీసుకొచ్చారు.@ncbn చాలా గొప్ప పని చేస్తున్నారు అండి C M గారు.

Publiée par Janasena Kuwait sur Mercredi 5 décembre 2018