Telugu Global
Cinema & Entertainment

బెల్లంకొండ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్

ఈరోజు కవచం సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు బెల్లంకొండ. యాదృచ్ఛికంగా ఇదే రోజు అతడు నటిస్తున్న మరో సినిమా టైటిల్ పై కూడా గాసిప్స్ మొదలయ్యాయి. అవును.. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమాకు సీత అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. దాదాపు ఇదే టైటిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటివరకు తనచుట్టూ తిరిగే కథల్ని మాత్రమే సెలక్ట్ చేసుకున్నాడు బెల్లంకొండ. కానీ తేజ సినిమాను చాలా స్పెషల్ […]

బెల్లంకొండ కొత్త సినిమా టైటిల్ ఫిక్స్
X
ఈరోజు కవచం సినిమాతో థియేటర్లలోకి వచ్చాడు బెల్లంకొండ. యాదృచ్ఛికంగా ఇదే రోజు అతడు నటిస్తున్న మరో సినిమా టైటిల్ పై కూడా గాసిప్స్ మొదలయ్యాయి. అవును.. తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమాకు సీత అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు వార్తలొస్తున్నాయి. దాదాపు ఇదే టైటిల్ తో ఫస్ట్ లుక్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.
ఇప్పటివరకు తనచుట్టూ తిరిగే కథల్ని మాత్రమే సెలక్ట్ చేసుకున్నాడు బెల్లంకొండ. కానీ తేజ సినిమాను చాలా స్పెషల్ గా చెప్పుకొస్తున్నాడు. దానికి కారణం అది ఫిమేల్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ అని తెలుస్తోంది. కాజల్ చుట్టూ తిరిగే ఈ సినిమాకు, కథానుసారం సీత అనే టైటిల్ పెట్టడమే కరెక్ట్ అని యూనిట్ భావిస్తోంది.
ప్రస్తుతానికైతే సీత అనే పేరుతో పాటు మరో 2 పేర్లు ఫైనలైజ్ చేశారు. వీటిలోంచి ఒక టైటిల్ ను మరో వారం రోజుల్లో అఫీషియల్ గా ప్రకటించే ఛాన్స్ ఉంది. అనీల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో సెకెండ్ హీరోయిన్ గా మన్నారా చోప్రా నటిస్తోంది. ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు.
First Published:  7 Dec 2018 12:53 AM GMT
Next Story