Telugu Global
Cinema & Entertainment

ఈషా చెప్పిన కొత్త సినిమా సంగతులు

బడా హీరోల సరసన ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటోంది హీరోయిన్ ఈషా రెబ్బా. తాజాగా అరవింద సమేత సినిమాలో నటించిన ఈ బ్యూటీ, ఇప్పుడు సుబ్రహ్మణ్యపురం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రోజు ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈషా రెబ్బా.. తన అప్ కమింగ్ మూవీస్ పై స్పందించింది. కొత్త ఏడాదిలో కన్నడ, తమిళ సినీపరిశ్రమల్లోకి అడుగుపెట్టబోతున్నట్టు ప్రకటించింది. “కాస్త రూటు మార్చాను. ఇన్నాళ్లూ టాలీవుడ్ కే ఫిక్స్ అయ్యాను. […]

ఈషా చెప్పిన కొత్త సినిమా సంగతులు
X
బడా హీరోల సరసన ఇప్పుడిప్పుడే అవకాశాలు అందుకుంటోంది హీరోయిన్ ఈషా రెబ్బా. తాజాగా అరవింద సమేత సినిమాలో నటించిన ఈ బ్యూటీ, ఇప్పుడు సుబ్రహ్మణ్యపురం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ రోజు ఈ సినిమా థియేటర్లలోకి వచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఈషా రెబ్బా.. తన అప్ కమింగ్ మూవీస్ పై స్పందించింది. కొత్త ఏడాదిలో కన్నడ, తమిళ సినీపరిశ్రమల్లోకి అడుగుపెట్టబోతున్నట్టు ప్రకటించింది.
“కాస్త రూటు మార్చాను. ఇన్నాళ్లూ టాలీవుడ్ కే ఫిక్స్ అయ్యాను. ఇకపై ఇతర భాషల్లో కూడా నటిస్తాను. ప్రస్తుతం ఓ తమిళ సినిమాలో నటిస్తున్నాను. దీంతో పాటు మరో కన్నడ మూవీ కూడా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలూ వచ్చే ఏడాది విడుదలవుతాయి.”
ఇలా తన శాండిల్ వుడ్, కోలీవుడ్ ఎంట్రీలపై స్పందించింది ఈషా రెబ్బా. ఆ సినిమాల్లో తను కాస్త గ్లామరస్ గా కనిపించడంతో పాటు.. యాక్టింగ్ కు స్కోప్ ఉన్న పాత్రలు చేస్తున్నానని స్పష్టంచేసింది. దీంతో పాటు తెలుగులో తన అప్ కమింగ్ మూవీ వివరాల్ని వెల్లడించింది ఈషా.
“ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క సినిమా చేస్తున్నాను. నాగశౌర్య హీరోగా ఆ సినిమా తెరకెక్కుతోంది. మొన్ననే ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ అయింది. భవ్య ఆనంద ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలతో బిజీగా ఉన్నారు. తెలంగాణలో పోలింగ్, కౌంటింగ్ ప్రాసెస్ ముగిసి, కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా సినిమా సెకెండ్ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.”
సుబ్రహ్మణ్యపురం చాలా బాగుంటుంది, అందరూ చూడండంటోంది ఈ బ్యూటీ. ఇకపై తెలుగుతో పాటు తమిళ్ లో కూడా సైమల్టేనియస్ గా సినిమాలు చేస్తానంటోంది.
First Published:  7 Dec 2018 1:17 AM GMT
Next Story