Telugu Global
NEWS

నేను ఒక్క మాట అన్నానంటే జరిగి తీరుతుంది.... బాబుకు పాల్ వార్నింగ్

ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ …. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ను కూడా కలుస్తానన్నారు. ఏపీలో ప్రతిపక్ష నాయకులకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. జగన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తే పట్టించుకునే వారే లేరన్నారు. పవన్‌ కల్యాణ్‌ను యాక్సిడెంట్‌లో చంపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు తీరు […]

నేను ఒక్క మాట అన్నానంటే జరిగి తీరుతుంది.... బాబుకు పాల్ వార్నింగ్
X

ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ …. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు రాష్ట్రంలో రాక్షస పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. వెంటనే ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. దీనిపై రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ను కూడా కలుస్తానన్నారు.

ఏపీలో ప్రతిపక్ష నాయకులకు కూడా రక్షణ లేకుండా పోయిందన్నారు. జగన్‌ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తే పట్టించుకునే వారే లేరన్నారు. పవన్‌ కల్యాణ్‌ను యాక్సిడెంట్‌లో చంపేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. చంద్రబాబు తీరు చూస్తుంటే అనేక అనుమానాలు కలుగుతున్నాయన్నారు. బాలయోగి, ఎర్రన్నాయుడు, లాల్‌జాన్‌ బాషా వీరంతా ఎలా చనిపోయారో సీబీఐ విచారణ జరిపించాలన్నారు.

2014లో ఇదే చంద్రబాబు తన వద్దకు వచ్చి మద్దతు తీసుకున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు కోసం ఆ రోజు తాను ప్రార్థనలు చేశానన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క శాంతి సభకు కూడా చంద్రబాబు తనకు అనుమతి ఇవ్వడంలేదన్నారు. ఇటీవల సభ కోసం దరఖాస్తు చేయగా ఏవేవో కారణాలు చెప్పి నిరాకరించారన్నారు. దీనిపై తాను కోర్టుకు వెళ్తానని చెప్పారు.

2014 ఎన్నికల్లో మద్దతు ఇస్తే పీస్ మిషన్ ను తిరిగి తెరిపిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి తనను కూడా మోసం చేశారన్నారు. చంద్రబాబు చేతిలో ప్రతి ఒక్కరూ మోసపోయారన్నారు. నాలుగున్నరేళ్లలో చంద్రబాబు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. కొడుకును ముఖ్యమంత్రిని చేసి చంద్రబాబు ప్రధాని కావాలనుకుంటున్నారని.. కానీ అలా జరగడం అసంభవం అన్నారు.

తన నోటి నుంచి ఒక మాట వస్తే అది జరిగి తీరుతుందన్నారు కేఏ పాల్. ఆ విషయాన్ని గుర్తించుకుని చంద్రబాబు ప్రవర్తించాలని సూచించారు. వెంటనే తన సభకు అనుమతి ఇవ్వకపోతే ఈనెల 8న టీడీపీ ఆఫీస్‌ వద్ద ధర్నాకు దిగుతానని కేఏ పాల్ ప్రకటించారు.

మూడు నుంచి నాలుగు శాతం ఓట్లున్న జనసేన లాంటి చిన్న పార్టీల సభలకు అనుమతి ఇస్తున్న చంద్రబాబు ప్రభుత్వం… తన శాంతి సభకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు కేఏ పాల్.

First Published:  6 Dec 2018 10:20 PM GMT
Next Story