Telugu Global
NEWS

రెండుగా చీలిన కడప జిల్లా టీడీపీ నేతలు

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని ఇటీవల చంద్రబాబు చెప్పారు. ఈనెల 27న శంకుస్థాపన చేసేందుకు కూడా ముహూర్తం ఖరారు చేశారు. అయితే హఠాత్తుగా కడప ఉక్కుపై టీడీపీ నేతలు కొత్త వివాదాన్ని తెరపైకి తెస్తున్నారు. ఉక్కు పరిశ్రమను కడప జిల్లాలోనే ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై టీడీపీనేతలు రెండుగా చీలారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేష్‌లు జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు. […]

రెండుగా చీలిన కడప జిల్లా టీడీపీ నేతలు
X

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తుందని ఇటీవల చంద్రబాబు చెప్పారు. ఈనెల 27న శంకుస్థాపన చేసేందుకు కూడా ముహూర్తం ఖరారు చేశారు. అయితే హఠాత్తుగా కడప ఉక్కుపై టీడీపీ నేతలు కొత్త వివాదాన్ని తెరపైకి తెస్తున్నారు.

ఉక్కు పరిశ్రమను కడప జిల్లాలోనే ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై టీడీపీనేతలు రెండుగా చీలారు. మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేష్‌లు జమ్మలమడుగు నియోజకవర్గంలోని మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని పట్టుబడుతున్నారు. శంకుస్థాపనకు స్థలాన్ని కూడా అక్కడే సిద్ధం చేశారు.

ఇంతలో మిగిలిన కడప జిల్లా టీడీపీ నేతలు … ఉక్కు పరిశ్రమను జమ్మలమడుగు నియోజక వర్గంలో ఏర్పాటు చేయడానికి వీల్లేదంటూ ఇన్‌చార్జ్ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డిని కలిశారు.

జమ్మలమడుగు నియోజకవర్గంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు తాము వ్యతిరేకమని ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి వివరించాలని సోమిరెడ్డిపై సదరు టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. జమ్మలమడుగు నియోజక వర్గంలో ఉక్కు పరిశ్రమను వ్యతిరేకిస్తున్న జిల్లా టీడీపీ నేతలు అందుకు ప్రత్యామ్నాయంగా కడప నగరానికి సమీపంలో వైఎస్ హయాంలో ఏపీఐఐసీ ద్వారా సేకరించిన ఎనిమిది వేల ఎకరాల భూమిలోనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని ప్రతిపాదన పెడుతున్నారు.

మైలవరం ప్రాజెక్టు నుంచి నీరు అందుబాటులో ఉంటుందన్న ఒక్క కారణం మినహా జమ్మలమడుగు నియోజక వర్గంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఏమాత్రం అనువు కాదని కడప జిల్లాకే చెందిన మరో వర్గం టీడీపీ నేతలు వాదిస్తున్నారు.

కడప నగర సమీపంలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేస్తే అందరికీ న్యాయం జరుగుతుందని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వద్ద గట్టిగా వాదన వినిపించారు. కడప సమీపంలోని భూముల్లో ప్లాంట్ ఏర్పాటు చేస్తే నీటిని సోమశిల బ్యాక్‌ వాటర్‌ నుంచి పైప్ లైన్ ద్వారా తీసుకోవచ్చని సూచిస్తున్నారు.

చిత్తశుద్ది విషయం పక్కన పెడితే కనీసం ఉక్కు పరిశ్రమకు ఒక అడుగు ముందుకు పడుతోంది అని భావిస్తున్న వేళ టీడీపీ నేతలే రెండుగా చీలిపోయి గొడవకు దిగడంపై ప్రజాసంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ వివాదాన్ని టీడీపీ నాయకత్వమే రాజేసిందని భావిస్తున్నారు. కడప జిల్లా నేతలే రెండుగా చీలిపోయి గొడవ పడితే… టీడీపీకి పట్టున్న పక్క జిల్లాకు ప్లాంట్‌ను తరలించే ఆలోచన కూడా ప్రభుత్వ పెద్దలు చేస్తున్నారన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు.

అలా చేయడం వల్ల తిరిగి జిల్లాల మధ్య కూడా వివాదం రేపినట్టు అవుతుందని ఆందోళన చెందుతున్నారు. మొత్తం మీద ఈనెల 27న ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తారని భావిస్తున్న వేళ కడప జిల్లా టీడీపీ నేతలే రెండుగా చీలిపోయి ప్లాంట్‌ స్థలంలో రచ్చ మొదలుపెట్టడం చర్చకు దారితీస్తోంది.

First Published:  6 Dec 2018 8:44 PM GMT
Next Story