బావా.. నీకు లక్ష మెజారిటీ- కేటీఆర్, హరీష్ చిట్ చాట్‌

ఎన్నికల పోలింగ్ సరళి తర్వాత గెలుపుపై టీఆర్‌ఎస్ నేతలు మరింత ధీమా వ్యక్తం చేస్తున్నారు. భారీ గెలుపును సొంతం చేసుకోబోతున్నామని ఉదయం కేసీఆర్‌ మీడియా ముందు చెప్పారు. తిరిగి అధికారంలోకి టీఆర్ఎస్సే వస్తుందని ధీమాగా చెప్పారు.

టీఆర్‌ఎస్ తాజా మాజీ మంత్రులు హరీష్‌ రావు, కేటీఆర్‌ కూడా అంతే ధీమాగా ఉన్నారు. సిద్ధిపేటలో పోలింగ్‌ సరళిని పరిశీలిస్తున్న హరీష్‌రావుకు… ఒక పోలింగ్ బూత్ వద్ద కేటీఆర్‌ ఎదురుపడ్డారు.

హరీష్‌రావును చూడగానే కేటీఆర్‌… బావా.. కంగ్రాట్స్ … లక్ష మెజారిటీతో గెలుస్తున్నావ్‌… అంటూ శుభాకాంక్షలు చెప్పారు. సిరిసిల్లలో తనకు 60వేల మెజారిటీ వస్తుందని అంచనా వేస్తున్నట్టు కేటీఆర్ చెప్పారు. మా బావాకు వచ్చే మెజారిటీలో సగమైనా తాను తెచ్చుకోవాలి కదా అంటూ అక్కడున్న వారితో సరదాగా వ్యాఖ్యానించారు.  పోలింగ్‌ సరళిపై హరీష్ , కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌దే గెలుపు అని ధీమా వ్యక్తం చేశారు.