Telugu Global
NEWS

హైదరాబాద్‌కు మోత్కుపల్లి తరలింపు....

సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అర్థరాత్రి ఆయనకు చాతీ నొప్పి వచ్చింది. వాంతులు అయ్యాయి. దీంతో వెంటనే కుటుంబసభ్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప్రత్రికి తీసుకెళ్లారు. చంద్రబాబు మోసం చేశారంటూ ఇటీవలే టీడీపీ నుంచి బయటకు వచ్చిన మోత్కుపల్లి … ప్రస్తుత ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్ అభ్యర్థిగా […]

హైదరాబాద్‌కు మోత్కుపల్లి తరలింపు....
X

సీనియర్‌ నేత మోత్కుపల్లి నర్సింహులు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అర్థరాత్రి ఆయనకు చాతీ నొప్పి వచ్చింది. వాంతులు అయ్యాయి. దీంతో వెంటనే కుటుంబసభ్యులు భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్ప్రత్రికి తీసుకెళ్లారు.

చంద్రబాబు మోసం చేశారంటూ ఇటీవలే టీడీపీ నుంచి బయటకు వచ్చిన మోత్కుపల్లి … ప్రస్తుత ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు.

ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్న ఆయన… రాత్రి హఠాత్తుగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. పోలింగ్‌కు కొన్ని గంటల ముందే ఇలా జరగడంతో ఆయన అనుచరులు ఆవేదన చెందుతున్నారు.

First Published:  6 Dec 2018 11:30 PM GMT
Next Story