తెలంగాణ పోలింగ్.. బయటకొచ్చిన ఎన్టీఆర్ లుక్

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న ఈ మల్టీస్టారర్ మూవీలో రామ్ చరణ్ లుక్ పై అందరికీ ఓ క్లారిటీ ఉంది. ఎందుకంటే అతడు వినయ విధేయ రామ షూటింగ్ లో ఉన్నాడు. దాదాపు అదే లుక్ తో రాజమౌళి సినిమా ఫస్ట్ షెడ్యూల్ లో పాల్గొన్నాడు. ఎటొచ్చి ఎన్టీఆర్ లుక్ పై మాత్రం అందరికీ డౌట్స్ ఉన్నాయి.
చాన్నాళ్లు కెమెరాకు కనిపించకుండా పోయిన ఎన్టీఆర్ ఈరోజు బయటకొచ్చాయి. తెలంగాణ ఎన్నికల సందర్భంగా ఓటేయడానికి వచ్చిన ఎన్టీఆర్ చాలా లావుగా కనిపించాడు. గుబురుగా గడ్డం పెంచాడు. దట్టంగా మీసాలు పెంచాడు. పొట్ట కూడా ముందుకొచ్చింది. ఎన్టీఆర్ ఈమధ్య కాలంలో ఇంత లావుగా ఎప్పుడూ కనిపించలేదు. ఇప్పుడే ఎందుకిలా మారాడంటే, అది రాజమౌళి పుణ్యమే.
అవును.. రాజమౌళి సూచనల మేరకే తారక్ ఇలా బల్కీగా తయారయ్యాడు. సినిమాలో ఇది ఒక షేడ్ మాత్రమే. మరో షేడ్ లో ఫిట్ అండ్ స్లిమ్ పర్సనాలిటీతో కనిపించబోతున్నాడు. నిన్ననే ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయింది. హీరోయిన్లను ఇంకా ప్రకటించలేదు.