Telugu Global
Cinema & Entertainment

ఛాన్స్ వస్తే విలన్ గా నటిస్తా

మొన్నటివరకు హీరో వేషాలు వేశాడు. కాలం కలిసిరాక ఈమధ్య వరుసగా ఫ్లాపులిస్తూ వస్తున్నాడు. దీంతో రాజ్ తరుణ్ మైండ్ సెట్ మారినట్టుంది. కుదిరితే విలన్ గా కూడా కనిపిస్తానంటున్నాడు ఈ లవర్ బాయ్. ఇదే విషయాన్ని నిన్న జరిగిన ట్విట్టర్ ఛాటింగ్ లో బయటపెట్టాడు. తనకు విలన్ గా కనిపించడం ఇష్టమని, మహేష్ బాబు సినిమాలో అవకాశం వస్తే విలన్ గా నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ట్వీట్ చేశాడు […]

ఛాన్స్ వస్తే విలన్ గా నటిస్తా
X
మొన్నటివరకు హీరో వేషాలు వేశాడు. కాలం కలిసిరాక ఈమధ్య వరుసగా ఫ్లాపులిస్తూ వస్తున్నాడు. దీంతో రాజ్ తరుణ్ మైండ్ సెట్ మారినట్టుంది. కుదిరితే విలన్ గా కూడా కనిపిస్తానంటున్నాడు ఈ లవర్ బాయ్. ఇదే విషయాన్ని నిన్న జరిగిన ట్విట్టర్ ఛాటింగ్ లో బయటపెట్టాడు.
తనకు విలన్ గా కనిపించడం ఇష్టమని, మహేష్ బాబు సినిమాలో అవకాశం వస్తే విలన్ గా నటించడానికి ఎలాంటి అభ్యంతరం లేదంటూ ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ట్వీట్ చేశాడు రాజ్ తరుణ్. విలన్ వేషాలతో పాటు తన కెరీర్ లో బెస్ట్-వరస్ట్ సినిమాలపై కూడా రియాక్ట్ అయ్యాడు.
తన కెరీర్ లో ఉయ్యాల జంపాల సినిమాను బెస్ట్ మూవీగా చెప్పుకొచ్చాడు రాజ్ తరుణ్. ఎందుకంటే ఆ సినిమాకు తను రైటర్ గా కూడా వర్క్ చేశానని స్ఫష్టంచేశాడు. ఇక ఈ ఏడాది స్టార్టింగ్ లో వచ్చిన రంగులరాట్నం సినిమాను తన కెరీర్ లో వరస్ట్ మూవీగా చెప్పుకొచ్చాడు. అంతేకాదు, దయచేసి ఎవరూ రంగులరాట్నం సినిమాను గుర్తుచేయొద్దని రిక్వెస్ట్ చేశాడు.
First Published:  7 Dec 2018 1:30 AM GMT
Next Story