Telugu Global
NEWS

గుత్తా జ్వాల అసంతృప్తి... రాఘవేంద్రరావును అడ్డుకున్న ఓటర్లు

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పలువురు వీఐపీలు హైదరాబాద్‌లో ఓటేశారు. సినీ స్టార్లు కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఓటేశారు. చిరంజీవి తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి వచ్చి ఓటేశారు. రాంచరణ్‌ విదేశాల్లో ఉండడంతో ఓటేసేందుకు రాలేదు. నాగార్జున, అల్లు అర్జున్, పోసాని కృష్ణమురళీ, శ్రీకాంత్‌, వెంకటేష్, తదితరులు ఓటేశారు. క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓటు మాత్రం గల్లంతు అయింది. తన వద్ద అన్ని గుర్తింపు కార్డులు ఉన్నా లిస్ట్‌లో మాత్రం ఓటు లేదని […]

గుత్తా జ్వాల అసంతృప్తి... రాఘవేంద్రరావును అడ్డుకున్న ఓటర్లు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. పలువురు వీఐపీలు హైదరాబాద్‌లో ఓటేశారు. సినీ స్టార్లు కుటుంబసభ్యులతో కలిసి వచ్చి ఓటేశారు. చిరంజీవి తన భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి వచ్చి ఓటేశారు. రాంచరణ్‌ విదేశాల్లో ఉండడంతో ఓటేసేందుకు రాలేదు. నాగార్జున, అల్లు అర్జున్, పోసాని కృష్ణమురళీ, శ్రీకాంత్‌, వెంకటేష్, తదితరులు ఓటేశారు.

క్రీడాకారిణి గుత్తా జ్వాల ఓటు మాత్రం గల్లంతు అయింది. తన వద్ద అన్ని గుర్తింపు కార్డులు ఉన్నా లిస్ట్‌లో మాత్రం ఓటు లేదని గుత్తా జ్వాల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వాహణ పారదర్శకంగా లేదని విమర్శించారు.

అటు రాఘవేంద్రరావుకు ఫిల్మ్‌నగర్‌ క్లబ్‌ వద్ద జనం నుంచి చుక్కెదురైంది. ఓటేసేందుకు వచ్చిన రాఘవేంద్రరావు… క్యూలో నిలబడకుండా నేరుగా పోలింగ్‌ బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. అప్పటికే చాలా సేపటి నుంచి క్యూలైన్‌లో ఉన్న ఓటర్లకు కోపం వచ్చింది. నేరుగా లోనికి వెళ్తున్న రాఘవేంద్రరావుతో వాగ్వాదానికి దిగారు. క్యూలైన్లో వెళ్లాలన్న విషయం తెలియదా అని నిలదీశారు. దీంతో వెనక్కు తగ్గిన రాఘవేంద్రరావు… క్యూలైన్లో నిలబడ్డారు.

కొన్ని చోట్ల ఈవీఎంల వద్ద సరైన వెలుతురు లేకపోవడంతో ఓటర్లు ఇబ్బందిపడ్డారు. ఈవీఎంలను చీకట్లో ఉంచారని… దీని వల్ల గుర్తులు సరిగా కనిపించడం లేదని… వృద్ధులు ఇబ్బంది పడే అవకాశం ఉందని దర్శకుడు పోసాని అభిప్రాయపడ్డారు.

First Published:  6 Dec 2018 11:21 PM GMT
Next Story