Telugu Global
NEWS

టీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ

సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్ధించలేదు. తెలంగాణలో బీసీ జనాభా అధికంగా ఉన్నందుకు రిజర్వేషన్లు పెంచేందుకు అవకాశం ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతానికి దాటేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం కోరినట్టు రిజర్వేషన్లను 67 శాతానికి పెంచడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.బీసీ రిజర్వేషన్ల విషయంలోనే కాకుండా గిరిజనులకు, మైనార్టీలకు […]

టీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ
X

సుప్రీం కోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్ల అంశంలో ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్ధించలేదు.

తెలంగాణలో బీసీ జనాభా అధికంగా ఉన్నందుకు రిజర్వేషన్లు పెంచేందుకు అవకాశం ఇవ్వాలన్న ప్రభుత్వ విజ్ఞప్తిని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతానికి దాటేందుకు వీల్లేదని స్పష్టం చేసింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వం కోరినట్టు రిజర్వేషన్లను 67 శాతానికి పెంచడం సాధ్యం కాదని స్పష్టం చేసింది.బీసీ రిజర్వేషన్ల విషయంలోనే కాకుండా గిరిజనులకు, మైనార్టీలకు రిజర్వేషన్ల శాతం పెంచేందుకు తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఆ అంశం కేంద్రం వద్ద పెండింగ్ లో ఉంది.

First Published:  7 Dec 2018 4:56 AM GMT
Next Story