Telugu Global
NEWS

ఇంగ్లీష్ నేర్పించి అమెరికా పంపించా.... మళ్ళీ అదే పాట....

టెక్నాలజీని, ప్రకృతి వ్యవసాయానికి అనుసంధానం చేస్తే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అమరావతిలో ప్రకృతి వ్యవసాయ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు రైతులు తమ అనుభవాలను వివరించారు. రాజు అనే ఒక వ్యక్తి తాను అమెరికాలో ఉద్యోగం చేసేవాడినని… కానీ అక్కడ యాంత్రికంగా బతకలేక తిరిగి వచ్చి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానని చెప్పారు. దీంతో వెంటనే మైక్ తీసుకున్న చంద్రబాబు… గత స్మృతులను నెమరేసుకున్నారు. తానే అప్పట్లో ఇలాంటి వారిని అమెరికాకు […]

ఇంగ్లీష్ నేర్పించి అమెరికా పంపించా.... మళ్ళీ అదే పాట....
X

టెక్నాలజీని, ప్రకృతి వ్యవసాయానికి అనుసంధానం చేస్తే అద్భుతమైన ఫలితాలను సాధించవచ్చన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. అమరావతిలో ప్రకృతి వ్యవసాయ సదస్సులో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొందరు రైతులు తమ అనుభవాలను వివరించారు. రాజు అనే ఒక వ్యక్తి తాను అమెరికాలో ఉద్యోగం చేసేవాడినని… కానీ అక్కడ యాంత్రికంగా బతకలేక తిరిగి వచ్చి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నానని చెప్పారు. దీంతో వెంటనే మైక్ తీసుకున్న చంద్రబాబు… గత స్మృతులను నెమరేసుకున్నారు.

తానే అప్పట్లో ఇలాంటి వారిని అమెరికాకు పంపించాలనుకున్నానని చెప్పారు. కానీ అప్పుడు అనుకున్నంతగా టెక్నాలజీ లేదని చెప్పారు. దాంతో తానే నాలెడ్జ్ ఎకానమీకి శ్రీకారం చుట్టానని చెప్పారు. అప్పట్లో ఐటీ మీద ఎన్నో సదస్సులు నిర్వహించానన్నారు. హైటెక్ సిటీని సృష్టించానని చెప్పారు. ఆ తర్వాత సైబరాబాద్‌ను సృష్టించానని చంద్రబాబు చెప్పారు. అప్పట్లో చాలా మందికి ఇంగ్లీష్‌ సరిగా వచ్చేది కాదన్నారు. అందుకోసం ఇంగ్లీష్‌ క్లాస్‌లు పెట్టించానన్నారు.

ఆరోజు తాను తీసుకున్న చర్యల వల్లే ఈ రోజు అమెరికా సిలికాన్‌ వ్యాలీలో అత్యధిక ఆదాయం పొందుతున్న వారిలో తెలుగువారు మొదటి స్థానంలో నిలబడగలిగారన్నారు చంద్రబాబు. అమెరికాలో క్రమశిక్షణ ఎక్కువగా ఉంటుందని… కానీ మాట్లాడుకునేందుకు కూడా సమయం ఉండదన్నారు. సర్వెంట్లు కూడా దొరకరని… ఎవరి పని వాళ్లే చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దాంతో రోబోలతో పనులు చేయిస్తున్నారన్నారు. మనిషిగా బతకాలంటే ఇండియాలోనే బతకాలని రాజు లాంటి వారు తిరిగి వస్తున్నారని చంద్రబాబు చెప్పారు.

జపాన్‌లో కుటుంబ వ్యవస్థ లేకపోవడం వల్లే ఎవరూ పిల్లలను కనడం లేదన్నారు. దాని వల్ల రోబోల సాయంలో అక్కడి ప్రజలు బతకాల్సి వస్తోందన్నారు. ఒకప్పుడు తానే కుటుంబ నియంత్రణను ప్రోత్సహించానని… ఇప్పుడు తానే చెబుతున్నానని ఎక్కువ మంది పిల్లలను కనాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు.

First Published:  8 Dec 2018 2:12 AM GMT
Next Story