Telugu Global
Cinema & Entertainment

"స్టార్ డైరెక్టర్" ప్రొడ్యూసర్ గా నాగ శౌర్య సినిమా

స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం కథ రాసే పనిలో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమాల నుంచి ఫ్రీ అవ్వగానే సుకుమార్ సినిమా స్టార్ట్ చేస్తాడు. మరో వైపు సుకుమార్ తన సినిమాలు తానూ చూసుకుంటూనే తన అసిస్టెంట్స్ ని కూడా దర్శకులుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం సుకుమార్ రాసిన ఒక కథ తన అసిస్టెంట్ తో సినిమాని డైరెక్ట్ చేయించబోతున్నాడు అంట. ఈ […]

స్టార్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గా నాగ శౌర్య సినిమా
X

స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కోసం కథ రాసే పనిలో బిజీగా ఉన్నాడు. మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సినిమాల నుంచి ఫ్రీ అవ్వగానే సుకుమార్ సినిమా స్టార్ట్ చేస్తాడు. మరో వైపు సుకుమార్ తన సినిమాలు తానూ చూసుకుంటూనే తన అసిస్టెంట్స్ ని కూడా దర్శకులుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. తాజా సమాచారం ప్రకారం సుకుమార్ రాసిన ఒక కథ తన అసిస్టెంట్ తో సినిమాని డైరెక్ట్ చేయించబోతున్నాడు అంట.

ఈ సినిమాలో నాగ శౌర్య హీరోగా నటించబోతున్నాడు. గతంలో రాజ్ తరుణ్ ని హీరోగా పెట్టి సినిమాని ప్రొడ్యూస్ చేసిన సుకుమార్ ఇప్పుడు నాగ శౌర్య ని హీరోగా పెట్టి తన సొంత ప్రొడక్షన్ హౌస్ అయిన సుకుమార్ రైటింగ్స్ పై సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నాడు. నాగ శౌర్య కూడా సినిమా కథ మొత్తం పూర్తీ కాకముందే కేవలం సుకుమార్ మీద ఉన్న నమ్మకంతో ఈ సినిమాని ఒప్పుకున్నాడు. ఇదిలా ఉంటే నాగ శౌర్య ప్రస్తుతం సమంతా లీడ్ రోల్ లో వస్తున్న ఒక సినిమాలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.

First Published:  7 Dec 2018 10:49 PM GMT
Next Story