ప్రపంచకప్ హాకీలో నేడు భారత్ మరో కీలకసమరం

  • క్వార్టర్ ఫైనల్స్ కు గురిపెట్టిన 5వ ర్యాంకర్ భారత్
  • రాత్రి 7 గంటల నుంచి కెనడాతో భారత్ అమీతుమీ

హాకీ ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్ బెర్త్ కు ఆతిథ్య భారత్ గురిపెట్టింది. గ్రూప్- సీ లీగ్ లో  ప్రపంచ మూడో ర్యాంకర్ బెల్జియంతో కలసి 4 పాయింట్లు చొప్పున సాధించడం ద్వారా సంయుక్త ఆగ్రస్థానంలో ఉన్న భారత్…ఈరోజు జరిగే ఆఖరి రౌండ్ పోటీలో కెనడాను అధిగమించగలిగితేనే…నేరుగా క్వార్టర్ ఫైనల్స్ చేరే అవకాశం ఉంది.

భువనేశ్వర్ కళింగ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా రాత్రి 7 గంటలకు ప్రారంభమయ్యే ఈ కీలక సమరంలో పటిష్టమైన కెనడా డిఫెన్స్ కు…యువఆటగాళ్లతో కూడిన భారత్ ఫార్వర్డ్ లైనప్ కు మధ్య ఆసక్తికరమైన పోరు జరుగనుంది. ఇదే గ్రూపులో మరో ఆఖరి రౌండ్ పోటీలో..బెల్జియం, సౌతాఫ్రికా జట్లు తలపడనున్నాయి.

గ్రూప్-సీ లీగ్ ప్రారంభమ్యాచ్ లో సౌతాఫ్రికాను 5-0 గోల్స్ తో చిత్తు చేయడం ద్వారా మూడు పాయింట్లు సాధించిన భారత్…రెండోరౌండ్లో పవర్ ఫుల్ బెల్జియం ను 2-2 గోల్స్ తో నిలువరించడం ద్వారా… మ్యాచ్ ను డ్రాగా ముగించి…పాయింట్లను నాలుగు కు పెంచుకోగలిగింది.