Telugu Global
Cinema & Entertainment

విరించి వర్మ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్!

నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ఏడాది “నా నువ్వే” అనే సినిమాతో ఒక ఫ్లాప్ ని…. అలాగే “ఎం.ఎల్.ఏ” అనే సినిమాతో ఒక యావరేజ్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రెండు సినిమాల తరువాత ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సినిమాటో గ్రాఫర్ కే.వి గుహన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. “118” అని టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈస్ట్ కోస్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ పై మహేష్ కోనేరు […]

విరించి వర్మ దర్శకత్వంలో కళ్యాణ్ రామ్!
X

నందమూరి కళ్యాణ్ రామ్ ఈ ఏడాది “నా నువ్వే” అనే సినిమాతో ఒక ఫ్లాప్ ని…. అలాగే “ఎం.ఎల్.ఏ” అనే సినిమాతో ఒక యావరేజ్ సినిమాని తన ఖాతాలో వేసుకున్నాడు.

ఈ రెండు సినిమాల తరువాత ప్రస్తుతం కళ్యాణ్ రామ్ సినిమాటో గ్రాఫర్ కే.వి గుహన్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. “118” అని టైటిల్ పెట్టుకున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈస్ట్ కోస్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ పై మహేష్ కోనేరు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నాడు.

ఇదిలా ఉంటే “ఉయ్యాలా జంపాలా” “మజ్ను” వంటి సినిమాలని డైరెక్ట్ చేసి డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న విరించి వర్మ ఇటీవలే కళ్యాణ్ రామ్ కి ఒక కథ చెప్పాడుట. కథ కథనాలు నచ్చిన కళ్యాణ్ రామ్ వెంటనే ఈ సినిమాకి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

వరుసగా పెద్ద సినిమాలు చేస్తూ స్టార్ ప్రొడ్యూసర్స్ గా దూసుకుపోతున్న హారిక హాసిని వారు ఈ సినిమాని ప్రొడ్యూస్ చేయనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లనుంది.

First Published:  8 Dec 2018 2:51 AM GMT
Next Story