Telugu Global
National

హనుమంతుడు దళితుడే

ఉత్తరప్రదేశ్‌లో కుల, మత రాజకీయాలకు పెద్దపీఠ వేస్తుంటారు. ప్రతీ రాజకీయ నాయకుడు తనకు అనుకూలమైన కుల, మత రాజకీయాలు చేస్తూనే ఉంటారు. యూపీ సీఎంగా పీఠమెక్కిన నాటి నుంచి మత రాజకీయాలకే పరిమితం అయిన యోగీ ఆదిత్యనాథ్ చర్యలు ఆ రాష్ట్ర ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి. యోగీ ఆదిత్యనాథ్ యూపీలోని పలు నగరాలు ముస్లింలు మాట్లాడే ఉర్థూలో ఉన్నాయనే కారణంతో వాటి పేర్లు మార్చేశారు. బీజేపీ సిద్దాంతాలను పుణికిపుచ్చుకున్న యోగీ ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కూడా తన […]

హనుమంతుడు దళితుడే
X

ఉత్తరప్రదేశ్‌లో కుల, మత రాజకీయాలకు పెద్దపీఠ వేస్తుంటారు. ప్రతీ రాజకీయ నాయకుడు తనకు అనుకూలమైన కుల, మత రాజకీయాలు చేస్తూనే ఉంటారు. యూపీ సీఎంగా పీఠమెక్కిన నాటి నుంచి మత రాజకీయాలకే పరిమితం అయిన యోగీ ఆదిత్యనాథ్ చర్యలు ఆ రాష్ట్ర ప్రజలకు ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.

యోగీ ఆదిత్యనాథ్ యూపీలోని పలు నగరాలు ముస్లింలు మాట్లాడే ఉర్థూలో ఉన్నాయనే కారణంతో వాటి పేర్లు మార్చేశారు. బీజేపీ సిద్దాంతాలను పుణికిపుచ్చుకున్న యోగీ ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కూడా తన మార్కు రాజకీయాలకు తెరతీశారు. హైదరాబాద్‌ను భాగ్యనగరంగా, కరీంనగర్‌ను కరిపురంగా మారుస్తానంటూ వాగ్దానాలు చేశారు.

ఇవన్నీ ఒకవైపు ఉండగా.. ఇటీవల ఆయన హనుమంతుడి కులం ఏంటో తేల్చేశారు. హనుమంతుడు దళితుడని ఆయన ఒక సభలో చెప్పారు. దీంతో యూపీలో పలు వర్గాల నుంచి విమర్శలు తలెత్తాయి. అసలు హనుమంతుడి కులమేంటో యోగీ ఎలా చెబుతారని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.

హనుమంతుడి కుల రాజకీయాల నేపథ్యంలో సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత శివపాల్ యాదవ్ వర్గీయులు వినూత్నంగా నిరసన తెలిపారు. నిజంగా హనుమంతుడు దళితుడు అయితే వారంలోపు కుల దృవీకరణ పత్రం జారీ చేయాలని డిమాండ్ చేశారు. శివపాల్ స్థాపించిన ప్రగతిశీల్‌ సమాజ్‌వాదీ పార్టీ తరపున వారణాసి జిల్లా అధ్యక్షుడు హరీష్ మిశ్రా.. ఇప్పటికే ఈ విషయంపై వారణాసి జిల్లా మెజిస్ట్రేట్ వద్ద దరఖాస్తు చేశారు.

బీజేపీ సీఎం యోగీ పేర్లు మార్చడమే కాదు ఇప్పుడు కులాలు కూడా నిర్ణయించడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. కుల, మత రాజకీయాలు చేసే ఆర్ఎస్ఎస్ అనుబంధ బీజేపీ .. ప్రజలను ఇలాంటి విషయాల్లో ఎప్పుడూ మభ్యపెడుతూనే ఉంటుందని పలువురు అంటున్నారు.

First Published:  8 Dec 2018 7:55 AM GMT
Next Story