Telugu Global
NEWS

ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు

అరంగేట్రం రంజీ మ్యాచ్ లోనే మధ్యప్రదేశ్ ఓపెనర్ రికార్డు స్కోరు హైదరాబాద్ పై అజయ్ రోహేరా 267 నాటౌట్ అమోల్ ముజుందార్ ప్రపంచ రికార్డు తెరమరుగు అంతర్జాతీయ క్రికెట్లో కొత్త రికార్డులు నమోదు కావడం…పాత రికార్డులు తెరమరుగు కావడం సాధారణ విషయమే. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రపంచ రికార్డులు నమోదు కావడం అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది. అలాంటి అరుదైన ప్రపంచ రికార్డు ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా హైదరాబాద్- మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరుగుతున్న ఎలైట్ […]

ఫస్ట్ క్లాస్ క్రికెట్లో సరికొత్త ప్రపంచ రికార్డు
X
  • అరంగేట్రం రంజీ మ్యాచ్ లోనే మధ్యప్రదేశ్ ఓపెనర్ రికార్డు స్కోరు
  • హైదరాబాద్ పై అజయ్ రోహేరా 267 నాటౌట్
  • అమోల్ ముజుందార్ ప్రపంచ రికార్డు తెరమరుగు

అంతర్జాతీయ క్రికెట్లో కొత్త రికార్డులు నమోదు కావడం…పాత రికార్డులు తెరమరుగు కావడం సాధారణ విషయమే. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రపంచ రికార్డులు నమోదు కావడం అత్యంత అరుదుగా జరుగుతూ ఉంటుంది.

అలాంటి అరుదైన ప్రపంచ రికార్డు ఇండోర్ హోల్కార్ స్టేడియం వేదికగా హైదరాబాద్- మధ్యప్రదేశ్ జట్ల మధ్య జరుగుతున్న ఎలైట్ గ్రూప్- బీ రంజీ మ్యాచ్ లో నమోదయ్యింది.

మధ్యప్రదేశ్ యువ ఓపెనర్ అజయ్ రోహేరా అరంగేట్రం మ్యాచ్ లోనే సరికొత్త ప్రపంచ రికార్డుతో చరిత్ర సృష్టించాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనే….

అంతర్జాతీయ క్రికెట్ మండలికి అనుబంధంగా ఉన్న…టెస్ట్ హోదా పొందిన వివిధ దేశాలలో జరిగే దేశవాళీ క్రికెట్ మ్యాచ్ లన్నీ ఫస్ట్ క్లాస్ క్రికెట్ తరగతిలోకే వస్తాయి.

భారత క్రికెట్ బోర్డు ఆధ్వర్యంలో జరిగే రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీ, ఇరానీ ట్రోఫీ, దేవధర్ ట్రోఫీ మ్యాచ్ ల కు సైతం ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచ్ లుగా గుర్తింపు ఉంది.

అంతర్జాతీయ క్రికెట్ కు దిగువ స్థాయిలో ఉండే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ప్రపంచ రికార్డులు అత్యంత అరుదైగా నమోదవుతూ ఉంటాయి.

అప్పుడు అమోల్ మజుందార్… ఇప్పుడు అజయ్ రోహేరా

భారత దేశవాళీ క్రికెట్ కే తలమానికంగా నిలిచే రంజీట్రోఫీ టోర్నీకి దశాబ్దాల చరిత్రే ఉంది. భారత టెస్ట్ జట్టులో చోటు సంపాదించాలంటే ఎంత గొప్ప ఆటగాడైనా…దేశవాళీ క్రికెట్లో…ప్రధానంగా రంజీట్రోఫీలో సత్తా చాటుకొని తీరాల్సిందే.

84 సంవత్సరాల రంజీట్రోఫీ….

బీసీసీఐకి అనుబంధంగా ఉన్న మొత్తం 28 క్రికెట్ సంఘాల జట్ల మధ్య ఏటా జరిగే రంజీట్రోఫీ మ్యాచ్ లకు 84 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర ఉంది. 1934 నుంచి క్రమంతప్పకుండా జరుగుతూ…. నిత్యనూతనంగా ఉంటూ వస్తున్న రంజీట్రోఫీలో ఎన్నో రికార్డులు ఉన్నాయి.

అయితే…రంజీట్రోఫీ అరంగేట్రం మ్యాచ్ లోనే అత్యధిక స్కోరు సాధించిన ఘనత కొద్ది గంటల క్రితం వరకూ…ముంబై మాజీ ఆటగాడు అమోల్ మజుందార్ పేరుతో ఉంది.

1994 సీజన్లో ఫరీదాబాద్ వేదికగా హర్యానాతో జరిగిన రంజీ మ్యాచ్ లో… అమోల్ 260 పరుగుల స్కోరు సాధించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఇదే ప్రపంచ రికార్డుగా ఉంటూ వచ్చింది.

ఇండోర్ వేదికగా సరికొత్త ప్రపంచ రికార్డు….

అయితే…ఇండోర్ లోని హోల్కార్ స్టేడియం వేదికగా …మధ్యప్రదేశ్, హైదరాబాద్ జట్ల మధ్య 2018 రంజీసీజన్ ఎలైట్ గ్రూప్- బీ మ్యాచ్ లో…మధ్యప్రదేశ్ ఓపెనర్ అజయ్ రోహేరా ఏకంగా 267 పరుగుల నాటౌట్ స్కోరుతో సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. 21 ఏళ్ల అజయ్ రోహేరా తన తొలి రంజీమ్యాచ్ లోనే….ఎంతో అనుభవం ఉన్న ఆటగాడిలా బ్యాటింగ్ కొనసాగించాడు.

ఎనలేని ఏకాగ్రతతో 345 బంతులు ఎదుర్కొని 21 బౌండ్రీలు, 5 సిక్సర్లతో 267 పరుగుల స్కోరుతో నాటౌట్ గా నిలిచాడు. ఇప్పటి వరకూ అమోల్ మజుందార్ పేరుతో ఉన్న 260 పరుగుల రికార్డు ను అజయ్ తెరమరుగు చేశాడు. వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ గా మధ్యప్రదేశ్ రంజీ జట్టులో చోటు సంపాదించిన అజయ్ రోహెరా….ఇప్పటి వరకూ జేపీ యాదవ్ పేరుతో ఉన్న 265 పరుగుల మధ్యప్రదేశ్ బ్యాట్స్ మన్ రికార్డును సైతం అధిగమించగలిగాడు.

అజయ్ రోహేరా రికార్డు స్కోరుతో…ఈమ్యాచ్ లో మధ్యప్రదేశ్ జట్టు…ఇన్నింగ్స్ 253 పరుగుల తేడాతో హైదరాబాద్ ను చిత్తు చేసింది.

ప్రస్తుత సీజన్ మిగిలిన రంజీ మ్యాచ్ ల్లోనూ అజయ్ రోహేరా ఇదేజోరు కొనసాగించగలిగితే…భారత క్రికెట్ కు ప్రతిభావంతుడైన మరో యువక్రికెటర్ దొరికినట్లే.

First Published:  9 Dec 2018 12:42 AM GMT
Next Story