Telugu Global
Cinema & Entertainment

సీక్రెట్ గా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి

హీరో నాగశౌర్య ఇప్పుడేం చేస్తున్నాడు? దీనికి చాలామంది సమాధానం చెప్పలేరు. ఎందుకంటే అతడి అప్ కమింగ్ మూవీస్ గురించి ఎవరికీ తెలియదు. ఎట్టకేలకు నాగశౌర్య కొత్త సినిమా సంగతులు బయటకొచ్చాయి. ఆమధ్య ఓ సినిమాను స్టార్ట్ చేసిన ఈ హీరో, రహస్యంగా ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశాడు. రాజా కొలుసు దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు నాగశౌర్య. ఈషా రెబ్బా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. […]

సీక్రెట్ గా ఫస్ట్ షెడ్యూల్ పూర్తి
X

హీరో నాగశౌర్య ఇప్పుడేం చేస్తున్నాడు? దీనికి చాలామంది సమాధానం చెప్పలేరు. ఎందుకంటే అతడి అప్ కమింగ్ మూవీస్ గురించి ఎవరికీ తెలియదు. ఎట్టకేలకు నాగశౌర్య కొత్త సినిమా సంగతులు బయటకొచ్చాయి. ఆమధ్య ఓ సినిమాను స్టార్ట్ చేసిన ఈ హీరో, రహస్యంగా ఫస్ట్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశాడు.

రాజా కొలుసు దర్శకత్వంలో కొత్త సినిమా స్టార్ట్ చేశాడు నాగశౌర్య. ఈషా రెబ్బా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఇదొక కామెడీ రొమాంటిక్ ఎంటర్ టైనర్. సినిమా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ అయిన విషయాన్ని స్వయంగా హీరోయిన్ బయటపెట్టింది.

భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. తెలంగాణ ఎన్నికల కారణంగా ఈ సినిమా బిజీగా ఉన్న ఆనంద్ ప్రసాద్, ఈ సినిమాను పట్టించుకోలేదని.. త్వరలోనే రెండో షెడ్యూల్ ప్రారంభమౌతుందని ఈషా తెలిపింది.

First Published:  9 Dec 2018 4:25 AM GMT
Next Story