Telugu Global
International

నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలతో రికార్డు సృష్టించిన రాష్ట్రం....

నేటి ఫాస్ట్ జనరేషన్ టెక్నాలజీలో 4జీ ఎలా కావాలని అనుకుంటుందో.. ప్రయాణాలు కూడా అంతే వేగంగా జరగాలని అనుకుంటుంది. ఒకప్పుడు విమానయానం అంటే అదో పెద్ద ఖర్చు, ధనవంతుల వ్యవహారంలా ఉండేది. కాని ఇప్పుడు విదేశాలకు కూడా పక్క ఊరికి వెళ్లి వస్తున్నట్లు వెళ్తున్నారు. మన దేశంలో గత కొన్ని ఏండ్లుగా విమానం ప్రయాణాలు సర్వ సాధారణంగా మారాయి. ప్రయాణికులు కూడా గణనీయంగా పెరిగారు. విమాన ప్రయాణికులు, విదేశాలకు వెళ్లే వాళ్లు పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాలు ఇంటర్నేషనల్ […]

నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలతో రికార్డు సృష్టించిన రాష్ట్రం....
X

నేటి ఫాస్ట్ జనరేషన్ టెక్నాలజీలో 4జీ ఎలా కావాలని అనుకుంటుందో.. ప్రయాణాలు కూడా అంతే వేగంగా జరగాలని అనుకుంటుంది. ఒకప్పుడు విమానయానం అంటే అదో పెద్ద ఖర్చు, ధనవంతుల వ్యవహారంలా ఉండేది. కాని ఇప్పుడు విదేశాలకు కూడా పక్క ఊరికి వెళ్లి వస్తున్నట్లు వెళ్తున్నారు. మన దేశంలో గత కొన్ని ఏండ్లుగా విమానం ప్రయాణాలు సర్వ సాధారణంగా మారాయి. ప్రయాణికులు కూడా గణనీయంగా పెరిగారు.

విమాన ప్రయాణికులు, విదేశాలకు వెళ్లే వాళ్లు పెరుగుతుండటంతో ఆయా రాష్ట్రాలు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుల ఏర్పాటు, ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల విస్తరణలు చేపట్టాయి. అయితే ఈ విమానాశ్రయాల్లో దేశంలోని ఒక రాష్ట్రం రికార్డు సృష్టించింది. దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర‌ప్రదేశ్‌లో లక్నో, వారణాసి మాత్రమే అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. అలాగే మహారాష్ట్రలో ముంబై, పూణే, నాగపూర్‌లో…. ఏపీలో విశాఖ, విజయవాడలో.. తెలంగాణలో హైదరాబాద్‌ లో అంతర్జాతీయ విమానాశ్రయాలున్నాయి.

అయితే విమానాశ్రయాల విషయంలో మాత్రం కేరళ రికార్డు సృష్టించింది. నిన్న కన్నూర్‌లో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. దీనితో కలిపి ఆ రాష్ట్రంలో మొత్తం 4 అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. తిరువనంతపురం, కొచ్చి, కోజికోడ్‌లలో ఇప్పటికే మూడు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉండగా.. తాజాగా కన్నూర్‌లో నాలుగోది ప్రారంభమైంది.

కేరళకు దేశీ టూరిస్టులే కాకుండా విదేశాల నుంచి ఎక్కువ మంది పర్యాటకులు వస్తుంటారు. అంతే కాకుండా కేరళవాసుల్లో చాలా మంది గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్లే విమానాలు కూడా ఎక్కువే. అందుకే ఆ చిన్న రాష్ట్రంలో నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్నాయి. ప్రస్తుతం అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న రాష్ట్రంగా కేరళ రికార్డు సృష్టించింది.

First Published:  9 Dec 2018 2:13 AM GMT
Next Story