Telugu Global
Cinema & Entertainment

క్రిష్ చెప్పిన 'ఎన్టీఆర్' సంగతులు

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సుమంత్, రానా, రకుల్, పాయల్, విద్యాబాలన్.. ఇలా ఎంతోమంది ప్రముఖులు ఇందులో నటిస్తున్నారు. వీటికి సంబంధించి వచ్చిన కొన్ని ఫస్ట్ లుక్స్ కూడా బాగానే ఎట్రాక్ట్ చేశాయి. అయితే ఇవన్నీ ఒకెత్తయితే.. ఈ బయోపిక్ కు సంబంధించి క్రిష్ చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మరో ఎత్తు. నిజానికి ఈ సినిమాను 4 గంటల సినిమాగా చేయాలనుకున్నారు. నిడివి మరీ ఎక్కువగా ఉంది […]

క్రిష్ చెప్పిన ఎన్టీఆర్ సంగతులు
X

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. సుమంత్, రానా, రకుల్, పాయల్, విద్యాబాలన్.. ఇలా ఎంతోమంది ప్రముఖులు ఇందులో నటిస్తున్నారు. వీటికి సంబంధించి వచ్చిన కొన్ని ఫస్ట్ లుక్స్ కూడా బాగానే ఎట్రాక్ట్ చేశాయి. అయితే ఇవన్నీ ఒకెత్తయితే.. ఈ బయోపిక్ కు సంబంధించి క్రిష్ చెప్పిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు మరో ఎత్తు.

నిజానికి ఈ సినిమాను 4 గంటల సినిమాగా చేయాలనుకున్నారు. నిడివి మరీ ఎక్కువగా ఉంది కాబట్టి, రెండు ఇంటర్వెల్స్ కూడా ప్లాన్ చేశారట. కానీ చాలా వర్గాల నుంచి, మార్కెట్, సన్నిహితుల నుంచి ఈ ప్రతిపాదనపై వ్యతిరేక వ్యక్తమైందట. అప్పుడు ఈ సినిమాను 2 భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నారు.

తీసిన 2 భాగాల్ని కూడా 2 వారాల గ్యాప్ లో విడుదల చేయాలని క్రిష్ నిర్ణయించారు. ఈ నిర్ణయంపై కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. మొదటి భాగాన్ని జనవరి 9న విడుదల చేసి, రెండో భాగాన్ని అదే నెల ఆఖరి వారంలో రిలీజ్ చేస్తే రెండు భాగాలకు వసూళ్లు పడిపోతాయని, రికార్డులు దక్కవని నందమూరి ఫ్యాన్స్ వ్యతిరేకించారట. అలా రెండో భాగాన్ని ఫిబ్రవరికి వాయిదావేశారట.

ఇలా బయోపిక్ కు సంబంధించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని కొన్ని సంగతుల్ని బయటపెట్టాడు క్రిష్. 7 రోజులు షూటింగ్ మినహా టోటల్ సినిమా కంప్లీట్ అయినట్టు ప్రకటించాడు క్రిష్. కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

First Published:  9 Dec 2018 5:00 AM GMT
Next Story