Telugu Global
NEWS

కంగారూ గడ్డపై 1000 పరుగుల విరాట్ కొహ్లీ

అడిలైడ్ టెస్ట్ రెండోఇన్నింగ్స్ లో 34 పరుగులకు కొహ్లీ అవుట్ ఆస్ట్రేలియాలో ఆసీస్ పై అత్యంత వేగంగా వెయ్యి పరుగుల భారత క్రికెటర్ కొహ్లీ మాస్టర్ సచిన్, ద్రావిడ్,లక్ష్మణ్ ల సరసన కొహ్లీ టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ…. మరో అరుదైన రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన భారత క్రికెటర్ గా నిలిచాడు. అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలిటెస్ట్ మూడోరోజు ఆట రెండో ఇన్నింగ్స్ లో… కొహ్లీ […]

కంగారూ గడ్డపై 1000 పరుగుల విరాట్ కొహ్లీ
X
  • అడిలైడ్ టెస్ట్ రెండోఇన్నింగ్స్ లో 34 పరుగులకు కొహ్లీ అవుట్
  • ఆస్ట్రేలియాలో ఆసీస్ పై అత్యంత వేగంగా వెయ్యి పరుగుల భారత క్రికెటర్ కొహ్లీ
  • మాస్టర్ సచిన్, ద్రావిడ్,లక్ష్మణ్ ల సరసన కొహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ…. మరో అరుదైన రికార్డు సాధించాడు. ఆస్ట్రేలియా గడ్డపై అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన భారత క్రికెటర్ గా నిలిచాడు.

అడిలైడ్ ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలిటెస్ట్ మూడోరోజు ఆట రెండో ఇన్నింగ్స్ లో… కొహ్లీ స్కోరు 30 పరుగులు దాటిన సమయంలో…కంగారూ గడ్డపై వెయ్యి పరుగుల మైలురాయిని చేరాడు. ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియా పై అత్యంత వేగంగా వెయ్యి పరుగులు సాధించిన టీమిండియా తొలి క్రికెటర్ గా నిలిచాడు.

నాలుగో భారత క్రికెటర్ కొహ్లీ….

కంగారూ గడ్డపై 1000 పరుగులు సాధించిన నాలుగో భారత క్రికెటర్ గా కొహ్లీ నిలిచాడు. గతంలో ఇదే ఘనత సాధించిన మొనగాళ్లలో సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రావిడ్, వీవీఎస్ లక్ష్మణ్ సైతం ఉన్నారు.

అడిలైడ్ టెస్ట్ తొలిఇన్నింగ్స్ లో కేవలం 3 పరుగులకే అవుటైన కొహ్లీ…. రెండో ఇన్నింగ్స్ లో 34 పరుగులే సాధించడం విశేషం.

రెండో ఇన్నింగ్స్ లో 104 బంతులు ఎదుర్కొనడం ద్వారా నిలదొక్కుకోడానికి ప్రయత్నించిన కొహ్లీ చివరకు ఆఫ్ స్పిన్నర్ నేథన్ లయన్ బౌలింగ్ లో..షార్ట్ లెగ్ లో ఫించ్ పట్టిన క్యాచ్ కు దొరికిపోయాడు.

ఆస్ట్రేలియాలో తన లక్కీ గ్రౌండ్ అడిలైడ్ ఓవల్ లో కొహ్లీ ప్రస్తుత సిరీస్ లో మాత్రం స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడు.

9 టెస్టుల్లోనే 1000 పరుగులు….

ఆస్ట్రేలియాతో ఆస్ట్రేలియా గడ్డపై ప్రస్తుత అడిలైడ్ టెస్ట్ వరకూ ఆడిన తొమ్మిది మ్యాచ్ ల్లోనే విరాట్ కొహ్లీ 1000 పరుగులు సాధించడం విశేషం.

ఆస్ట్రేలియా గడ్డపై గతంలో వెయ్యి పరుగులు సాధించిన భారత క్రికెటర్లలో మాస్టర్ సచిన్ టెండుల్కర్ 20 టెస్టుల్లో 1809 పరుగులతో 53.20 సగటు నమోదు …ఆస్ట్రేలియా గడ్డపై ఎక్కువ పరుగులు సాధించిన భారత క్రికెటర్ గా నిలిచాడు.

హైదరాబాదీ వెరీ వెరీ స్పెషల్ బ్యాట్స్ మన్ వీవీఎస్ లక్ష్మణ్ 15 టెస్టుల్లో 1236 పరుగులతో సచిన్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.

ఇక…ఇండియన్ క్రికెట్ వాల్ రాహుల్ ద్రావిడ్…15 టెస్టుల్లో 1236 పరుగులతో మూడోస్థానంలో కొనసాగుతున్నాడు.

విరాట్ కొహ్లీ మాత్రం…కేవలం 9 టెస్టుల్లోనే వెయ్యి పరుగులు సాధించి…నాలుగో స్థానంలో నిలిచాడు.

5 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు….

2014 ఆస్ట్రేలియా టూర్ లో విరాట్ కొహ్లీ… ఏకంగా 692 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఏకంగా 86.50 సగటు నమోదు చేశాడు. ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా…. విరాట్ కొహ్లీ ఆడిన గత ఎనిమిది టెస్టుల్లో 992 పరుగులతో…62.00 సగటు సాధించాడు. ఐదు సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు సైతం ఆస్ట్రేలియాపైన కొహ్లీకి సాధించిన రికార్డు ఉంది.

మాస్టర్ శతకాల రికార్డుకు కొహ్లీ గురి….

కంగారూ గడ్డపై ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా మాస్టర్ సచిన్ టెండుల్కర్ కు అత్యధికంగా ఆరు శతకాలు బాదిన ఘనత ఉంది.

ఫాస్ట్, బౌన్సీ పిచ్ లకు మరోపేరైన ఆస్ట్రేలియా గడ్డపై అత్యధిక సెంచరీలు సాధించిన భారత క్రికెటర్ ఘనత ప్రస్తుతం మాస్టర్ సచిన్ టెండుల్కర్ కే ఉంది.

అయితే…ప్రస్తుత సిరీస్ లోని మిగిలిన మూడు టెస్టుల్లో మాస్టర్ సెంచరీల రికార్డును అధిగమించే అవకాశం కొహ్లీకి మాత్రమే ఉంది.

గవాస్కర్ 5, కొహ్లీ 5 సెంచరీలు

భారత మాజీ మాజీ ఓపెనర్ సునీల్ గవాస్కర్ 11 టెస్టుల్లో 5 శతకాలు బాదితే…విరాట్ కొహ్లీ కేవలం 9 టెస్టుల్లోనే 5 సెంచరీలతో మాస్టర్ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

హైదరాబాదీ వెరీవెరీ స్పెషల్ బ్యాట్స్ మన్ వీవీఎస్ లక్ష్మణ్ ..కంగారూ గడ్డపై నాలుగు సెంచరీలు సాధించడం ద్వారా నాలుగోస్థానంలో కొనసాగుతున్నాడు.

ఇటు విరాట్ కొహ్లీ…అటు మాస్టర్ సచిన్….ఇద్దరూ 26 ఏళ్ల వయసుకే ఆస్ట్రేలియా ప్రత్యర్థిగా వెయ్యి పరుగుల మైలురాయిని చేరిన మొనగాళ్లుగా నిలిచారు.

26 ఏళ్లకే వెయ్యి పరుగులు….

1999 డిసెంబర్ 28న మాస్టర్ సచిన్ 26 సంవత్సరాల వయసులో 5 శతకాలతో సహా వెయ్యి పరుగుల మైలురాయిని చేరాడు.

విరాట్ కొహ్లీ సైతం…2014 డిసెంబర్ 28న ఆస్ట్రేలియా పై ఐదోశతకంతో పాటు వెయ్యి పరుగులు సాధించడం విశేషం.

ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న నాలుగుమ్యాచ్ ల సిరీస్ లోని తొలిటెస్ట్ వేదిక అడిలైడ్ ఓవల్ లో కొహ్లీ…స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్ లో 3, రెండో ఇన్నింగ్స్ లో 34 పరుగులు మాత్రమే సాధించి అవుటయ్యాడు.

73 టెస్టులు- 24 శతకాలు….

30 సంవత్సరాల విరాట్ కొహ్లీకి…ప్రస్తుత అడిలైడ్ టెస్ట్ వరకూ ఆడిన 74 టెస్టులు,126 ఇన్నింగ్స్ లో 24 సెంచరీలు, 19 హాఫ్ సెంచరీలతో సహా…మొత్తం 6వేల 368 పరుగులు సాధించాడు.

అంతేకాదు…మాస్టర్ సచిన్ టెండుల్కర్ 51 టెస్ట్ సెంచరీల ప్రపంచ రికార్డుకు…కొహ్లీ 26 శతకాల దూరంలో నిలిచాడు. సచిన్ పేరుతో ఉన్న సెంచరీలు, పరుగుల రికార్డులను అధిగమించే అవకాశం…. కేవలం విరాట్ కొహ్లీకి మాత్రమే ఉంది.

First Published:  8 Dec 2018 9:01 PM GMT
Next Story